టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని(Nani) ఒకరు.ప్రస్తుతం నాని సినిమాలలో నటిస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా మరోవైపు నిర్మాతగా మారి వరుస సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు.
ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న నాని హిట్ 3 (Hit 3)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా మే 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే నానికి యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది నిజానికి హిట్ సినిమాలో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 సినిమాలో విశ్వక్ కి బదులుగా అడవి శేష్ (Adivi Sesh)నటించిన ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఇప్పుడు పార్ట్ 3 లో ఏకంగా నాని నటిస్తున్నారు.
అయితే నాని విశ్వక్ మధ్య గొడవలు కారణంగానే అడవి శేష్ ఈ సినిమాలో నటించారు అంటూ అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి.

తాజాగా హిట్ 3 ప్రమోషన్లలో భాగంగా ఈ విషయం గురించి ప్రశ్నలు ఎదురవడంతో నాని స్పందించారు.ఈ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.విశ్వక్ కాదనడంతోనే శేష్ దగ్గరకు వెళ్లినట్లు కథనాలు వచ్చాయి.
ఇదొక సిరీస్ లాగా కాకుండా యూనివర్సల్ లాగా తీసుకెళ్లాలని అనుకున్నాం.కానీ నేను రాలేను అని అటువైపు నుంచి సమాధానం రావడంతోనే వేరే హీరోని తీసుకురావడం జరిగిందని నాని చెప్పాడు.
ఇంతకు మించి మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని నాని క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి చెక్ పెట్టినట్టు అయింది.