బిగుతైన దుస్తులు ధరించడం, గాలి సరిగ్గా ఆడక పోవడం, మాయిశ్చరైజర్ వాడకపోవడం, హార్మోన్ చేంజ్, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, అన్ వాంటెడ్ హెయిర్ ను రిమూవ్ చేయకపోవడం తదితర కారణాల వల్ల చాలా మందికి అండర్ ఆర్మ్స్ అనేవి డార్క్ గా( Dark Underarms ) ఉంటాయి.దాంతో స్లీవ్ లెస్ దుస్తులు వేసుకునేందుకు సంకోచిస్తుంటారు.
ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ ను వైట్ గా మార్చుకునేందుకు రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాను వారానికి రెండు సార్లు కనుక పాటిస్తే మీ అండర్ ఆర్మ్స్ వైట్ గా మారడం గ్యారెంటీ.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంటి చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Mitti ) వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, పావు టీ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా తడి లేకుండా అండర్ ఆర్మ్స్ ను టవల్ తో తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఇప్పుడు చెప్పుకున్న ఇంటి చిట్కాను పాటిస్తే అండర్ ఆర్మ్స్ లో నలుపు క్రమంగా మాయమవుతుంది.మురికి, మృత కణాలు తొలగిపోతాయి.అక్కడి చర్మం తెల్లగా మృదువుగా మారుతుంది.మరియు ఈ చిట్కాను పాటించడం వల్ల అండర్ ఆర్మ్స్ నుండి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది.
కాబట్టి తప్పకుండా ట్రై ప్రయత్నించండి.