ఫ్లోరిడాలో( Florida ) ఓ నర్సు.కేవలం 28 ఏళ్ల వయసులో తన స్టార్టప్‌ను ఏకంగా రూ.106 కోట్లకు (అమెరికా డాలర్లలో 12.5 మిలియన్ డాలర్లు) అమ్మేసి వార్తల్లోకెక్కారు.అంతేకాదు, ఆ వెంటనే రిటైర్ అయిపోయి ఫుల్-టైమ్ డాడీగా మారిపోయారు.నథానాయేల్ ఫారెల్లీ అతడి పేరు.స్మార్ట్ డెసిషన్స్, పర్ఫెక్ట్ టైమింగ్, కుటుంబంపై ప్రేమ ఇవే అతని విజయ రహస్యం.నథానాయేల్ ఫారెల్లీ ( Nathaniel Farrelly )అనే అతను 21 ఏళ్లకే రిజిస్టర్డ్ నర్సుగా మారారు.2020లో, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న టైంలో.రివైటలైజ్ (Revitalize) అనే ఒక హెల్త్‌కేర్ బిజినెస్‌ను మొదలుపెట్టారు.
ఇంటి వద్దే రోగులకు అవసరమైన ఐవీ మందులు ఇవ్వడానికి శిక్షణ పొందిన నర్సులను పంపడం వీరి పని.ఆసుపత్రులు కిక్కిరిసిపోయి, బయట ట్రీట్‌మెంట్లు అవసరమైన ఆ రోజుల్లో ఈ సేవ చాలా అవసరమైంది, బాగా ఉపయోగపడింది.

మొదలుపెట్టిన కొద్ది నెలల్లోనే అతని బిజినెస్ సూపర్‌ఫాస్ట్‌గా దూసుకెళ్లింది.పలు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కొనుగోలు ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి.అవీ లక్షల్లో కాదు.ఏకంగా మిలియన్ డాలర్ల ఆఫర్లు.అయితే, ఫారెల్లీ తొందరపడలేదు.అప్పుడే అమ్మడం కరెక్ట్ టైమ్ కాదని భావించి ఆ ఆఫర్లను తిరస్కరించారు.
చివరికి, 2023 వరకు ఎదురుచూసి.అమెరికాలోని అతిపెద్ద ఇన్ఫ్యూజన్ కంపెనీల్లో ఒకదానికి రివైటలైజ్ ను అమ్మేశారు.అమ్మిన ధర ఎంతో తెలుసా, ఏకంగా 12.5 మిలియన్ డాలర్లు.అంటే మన కరెన్సీలో రూ.106 కోట్లు. బిజినెస్ హ్యాండోవర్ కోసం అతను ఏడాదిన్నర పాటు కొత్త ఓనర్లతో కలిసి పనిచేశారు.ఆ తర్వాత పూర్తిస్థాయిలో పక్కకు తప్పుకున్నారు.అదే తన ‘రియల్ ఎగ్జిట్’ అని ఫారెల్లీ అంటున్నారు.

చాలా మంది సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌ల మాదిరిగా మరో బిజినెస్ మొదలుపెట్టకుండా, ఫారెల్లీ డిఫరెంట్ రూట్ ఎంచుకున్నారు.తన భార్యతో, ముగ్గురు పిల్లలతో ఎక్కువ టైమ్ గడపాలని నిర్ణయించుకున్నారు.త్వరలోనే వాళ్లకు నాలుగో బిడ్డ కూడా రాబోతున్నాడు.
ఇప్పుడు ఫారెల్లీ.ఫుల్-టైమ్ స్టే-ఎట్-హోమ్ డాడ్‌గా మారిపోయారు.
రిటైర్ అయినా ఫారెల్లీ పూర్తిగా బిజినెస్ ప్రపంచం నుంచి దూరంగా ఏం లేరు.ప్రస్తుతం చిన్న చిన్న బిజినెస్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు.
తన స్నేహితుడి కాఫీ బ్రాండ్‌లో, ఒక ఫిట్‌నెస్ యాప్‌లో కూడా ఇన్వెస్ట్ చేశారు.తన ఈ డెసిషన్‌కు డబ్బు ప్రధాన కారణం కాదని, తనకు నిజంగా ముఖ్యమైనది.
అంటే కుటుంబాన్ని చూసుకోవడమే తన పెద్ద లక్ష్యం అని నథానాయేల్ ఫారెల్లీ చెబుతున్నారు.