ఆయిలీ స్కిన్ వేధిస్తుందా? అయితే మీరీ ఫేస్‌వాష్ వాడాల్సిందే!

ఆయిలీ స్కిన్‌(జిడ్డు చ‌ర్మం)తో ముప్ప తిప్ప‌లు ప‌డుతున్న వారు ప్రపంచ‌వ్యాప్తంగా ఎంద‌రో ఉన్నారు.సెబాకస్ గ్రంధులు ఎక్కువగా జిడ్డును ఉత్ప‌త్తి చేయటం వల్లే ఆయిలీ స్కిన్ వేధిస్తూ ఉంటుంది.

 Homemade Face Wash For Oily Skin! Homemade Face Wash, Oily Skin, Face Wash, Late-TeluguStop.com

చూసేందుకు ఇది చిన్న స‌మ‌స్య‌గానే క‌నిపించినా.దానిని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల‌ మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు ఏర్ప‌డి ముఖ సౌంద‌ర్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

అందుకే జిడ్డు చ‌ర్మాన్ని నివారించుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.అయితే ఆయిలీ స్కిన్‌ను వ‌దిలించ‌డంలో ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ ఫేస్ వాష్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ ఫేస్ వాష్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.ముందుగా ఏదో ఒక బేబీ సోప్‌ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌టి పొడిలా చేసుకోవాలి.అలాగే రెండు పెద్ద సైజు కీరాల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి తురుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్‌ను మాత్రం వేరు చేసుకోవాలి.

ఇప్పుడు పెద్ద బౌల్‌లో ఒక క‌ప్పు కీర జ్యూస్‌, అర క‌ప్పు రోజ్ వాట‌ర్‌, మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న బేబీ సోప్ పౌడ‌ర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో ప‌ది నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల లెమ‌న్ జ్యూస్ వేసి మ‌రోసారి హ్యాండ్ బ్లెండర్‌తో క‌లిపితే ఫేస్ వాష్ సిద్ధ‌మైన‌ట్టే.ఈ ఫేస్ వాష్‌ను రోజుకు రెండు సార్లు వాడ‌టం వ‌ల్ల చ‌ర్మంపై అధిక జిడ్డు తొల‌గి పోయి ముఖం ఎల్ల‌ప్పుడూ ఫ్రెష్‌గా, గ్లోగా ఉంటుంది.

అంతే కాదు, రెగ్యుల‌ర్‌గా ఈ ఫేస్ వాష్‌ను యూజ్ చేస్తే ముఖంపై ఏర్పిడిన న‌ల్ల మ‌చ్చ‌లు సైతం క్ర‌మంగా త‌గ్గి పోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube