ఆ ఒక్క తప్పే ఈ హీరోయిన్స్ ని సినిమా ఇండస్ట్రీకి దూరం చేసిందా ?

సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో రాణించాలి అంటే నిలదొక్కుకోవాలి అంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అటు అదృష్టం కూడా అంతే కలిసి రావాలి అని చెప్పాలి.కొంతమంది హీరోయిన్ల విషయంలో కాస్త టాలెంట్ తక్కువగా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది.

 Tollywood Heroines Lost Options In Movies , Tollywood, Shalini Pandey, Rakshitha-TeluguStop.com

కానీ కొంతమంది మాత్రం టాలెంట్ ఉన్న మొదటి సినిమాతో హిట్టు కొట్టిన ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేక అవకాశాలు అందుకోలేక ఇండస్ట్రీలో కనుమరుగైన వారు చాలామంది ఉంటారు.ఇక అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

నేహా శర్మ : రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరుత.ఇక ఈ సినిమాతో బాలీవుడ్ డ్యూటీ నేహా శర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది.అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.కానీ నేహా శర్మకు మాత్రం అవకాశాలు రాలేదు.తర్వాత చిన్న హీరో వరుణ్ సందేశ్ కు జోడిగా కుర్రాడు అనే సినిమాలో నటించింది.సినిమా తర్వాత మాత్రం ఇండస్ట్రీలో పూర్తిగా కనుమరుగయ్యింది అని చెప్పాలి.

 Tollywood Heroines Lost Options In Movies , Tollywood, Shalini Pandey, Rakshitha-TeluguStop.com
Telugu Anitha, Karthika, Nehasharma, Rakshitha, Shalini Pandey, Tollywood-Latest

అనిత : యంగ్ సెన్సేషన్ హీరోగా పేరు సంపాదించుకున్న దివంగత ఉదయ్ కిరణ్ కు జోడిగా నువ్వు నేను అనే సినిమాలో నటించింది అనిత.ఈ సినిమా ఎంత మంచి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లో సరైన నిర్ణయాలు తీసుకోలేక చేతులారా కెరియర్ పాడు చేసుకుని ఇండస్ట్రీలో కనుమరుగయ్యింది.

Telugu Anitha, Karthika, Nehasharma, Rakshitha, Shalini Pandey, Tollywood-Latest

కార్తీక : నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాలో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది కార్తిక.అందం అభినయం ఆకట్టుకునే నటన ఈ అమ్మడి సొంతం.మొదట్లో అటు తెలుగుతోపాటు తమిళంలో కూడా అవకాశాలు దక్కించుకుంది.

కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం అదే రీతిలో అవకాశాలు అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

రక్షిత : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఇక ఈ సినిమా తర్వాత ఆంధ్రవాలా, నిజం సినిమాల్లో నటించింది.కానీ ఈ సినిమాలు పెద్ద హిట్ కాకపోవడంతో చివరికి కనిపించకుండా పోయింది రక్షిత.

శాలిని పాండే: అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించింది ఈ ముద్దుగుమ్మ.స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.

కానీ ఆ తర్వాత అడపా దడప్ప సినిమాలు తీసి ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ పోజులకే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube