వర్షాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు( Diabetes ) చాలా ఆందోళనలు కలుగుతూ ఉంటాయి.ఎందుకంటే తడిగా మారిన నేలలు,తేమ తో కూడిన వాతావరణం అన్నీ కూడా పాదాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతూ ఉంటాయి.
మీ పాదాలలోని( Foot ) అనుభూతిని దూరం చేసే నరాలు దెబ్బతినే అవకాశం ఉంది.ఇది పాదాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తూ ఉంటుంది.
గాయాన్ని నయం చేయడం లేదా ఇన్ఫెక్షన్ లో నిరోధించడం కష్టతరంగా మారుతుంది.

ఫలితంగా మీ పాదాలపై పొక్కు లేదా పుండ్లు ఏర్పడవచ్చు.ఇది ఇన్ఫెక్షన్ ( Infection ) క్రమంగా పెద్దదవుతూ నయం కానీ గాయాలకు దారి తీస్తుంది.చికిత్స చేయకుండా వదిలేస్తే చాలా ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఈ వర్షాకాలంలో ( Rainy Season ) తన పాదాల కోసం అదనపు శ్రద్ధ చూపాలని నిపుణులు చెబుతున్నారు.అయితే కొన్ని సాధారణ చిట్కాలతో ఈ వర్షాకాలంలో మీ పాదాలను ఆరోగ్యంగా సురక్షితంగా ఉంచుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే సరిగ్గా సరిపోయే బూట్లు ధరించేలా చూసుకోవడం మంచిది.ఎందుకంటే వేళ్లపై పండ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇంకా చెప్పాలంటే మీ పాదాలు ఎరుపు ఎకడం, నొప్పి ఉండడం పాదాలలో వాపు రావడం వంటివి గమనించవచ్చు.పాదాలపై గాయాలు అవ్వడం లేదా పొక్కులు రావడం వంటివి ఏమైనా ఉంటే పరిశీలించుకోవాలి.మీరు వీటిలో దేన్నైనా గమనించినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.ఈ సీజన్లో మీ పాదాలను శుభ్రంగా పొడిగా ఉంచుకోవడం ఎంతో మంచిది.ఎందుకంటే తేమా చర్మంపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.ఇది ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
కాబట్టి రోజు మీ పాదాలను తేలికపాటి సబ్బు తో శుభ్రం చేసుకోవాలి.అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.
అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు కచ్చితంగా ధరించాలి.ఇంకా చెప్పాలంటే రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులను గుర్తిస్తూ ఉండాలి.