16 ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూసిన వెంకీ అట్లూరి...ధనుష్ సాలిడ్ హిట్ ఇచ్చాడుగా !

వెంకీ అట్లూరి… ధనుష్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన సర్ సినిమాకు దర్శకత్వం వహించి తొలి సూపర్ హిట్ దిశగా దూరిపోతున్నాడు.చాలా ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉంటున్న కెరీర్ లో తనదైన గట్టి విజయాన్ని ఖాతాలో వేసుకో లేకపోయినా వెంకీ తెలుగు హీరోలను పక్కన పెట్టి తమిళ్ లో తొలి డెబ్యూ గా సర్ సినిమా తీసి అటు తమిళ్ తో పాటు తెలుగు లోనూ సాలిడ్ హిట్ కొట్టేశాడు.అయితే వెంకీ అట్లూరి సినిమా ప్రయాణం అంతా సాఫీగా ఏమీ సాగలేదు.2007 లో యాక్టింగ్ లోకి దిగి జ్ఞాపకం అనే సినిమాలో మైన్ లీడ్ గా నటించాడు.ఆ తర్వాత మూడేళ్ల పాటు మళ్ళీ నటుడిగా ఏమీ చేయలేక పోయిన మధుర శ్రీధర్ తీసిన స్నేహ గీతం సినిమాలో నటిస్తున్న ఆ చిత్రానికి డైలాగ్స్ కూడా రాశాడు.

 Venky Atluri Hardwork For One Hit , Venky Atluri, Dhanush, Sanyukta Menon, Sir M-TeluguStop.com

Telugu Dhanush, Kerintha, Mathura Sridhar, Majnu, Sai Kiran, Sanyukta Menon, Sir

ఆ సినిమా తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి 2011 లో మధుర శ్రీధర్ దర్శకత్వంలో లో వచ్చిన ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రానికి కూడా డైలాగ్స్ రాశాడు.వాస్తవానికి మధుర శ్రీధర్ మాత్రమే మొదట వెంకీ లోని రైటర్ నీ వెలికి తాసాడు.ఇక ఆ తర్వాత నాలుగు ఏళ్ల పాటు ఖాళీగానే ఉన్నాడు.

డైలాగ్ రైటర్ గా మరియు యాక్టర్ గా ఏ రకమైన అవకాశాలు అందుకోలేక పోయాడు.ఆ తర్వాత అడవి శేష్ అన్నయ్య అడవి సాయి కిరణ్ దర్శకత్వం వహించిన కేరింత సినిమా కు డైలాగ్స్ కాకుండా కథ అందించాడు.

ఇక ఏళ్లకు యేళ్లు డైలాగ్స్ రాస్తూ కూర్చోలేక మంచి కథ రాసుకొని చాలా మంది హీరోలకు వినిపించాడు.అలా రాసుకున్న కథకు తొలిప్రేమ అనే పేరు పెట్టి వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.

Telugu Dhanush, Kerintha, Mathura Sridhar, Majnu, Sai Kiran, Sanyukta Menon, Sir

ఇక ఆ తర్వాత 2019 లో అఖిల్ అక్కినేని రెండవ సినిమా మిస్టర్ మజ్ను కి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా పరాజయం పాలయ్యింది.2021 లో నితిన్ హీరో గా వచ్చిన రంగ్ దే చిత్రానికి దర్శకత్వం వహించగా ఇది కూడా పరాజయం పాలయ్యింది.ఇక తెలుగు హీరోలతో వర్క్ అవుట్ కాదని నిర్ణయించుకొని తమిళ్ లో తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

అలా తన సొంత కథ తోనే ధనుష్ హీరోగా వాతి సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా వెంకీ లోని సినిమా దాహాన్ని తీర్చింది అని చెప్పుకోవచ్చు.అంతే కాదు తన 16 ఏళ్ల కష్టానికి తగిన ప్రతఫలం కూడా దక్కింది.ఇక వాతి సినిమా తెలుగు లో సర్ పేరుతో విడుదల అయ్యి మంచి పాసిటివ్ టాక్ తెచ్చుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube