బాలయ్య బాబు పని అయిపొయింది అని అంత అనుకుంటున్న టైం లో ఎవరు ఊహించని విధంగా కెరీర్ చరమాంకం లో కొత్త గా, సరి కొత్తగా నూతన ఉత్తేజం తో ఉరకలు వేస్తున్నాడు.అప్పటి వరకు తీస్తున్న ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది.
ఇక తన సొంత తండ్రి పేరుతో తీసిన రెండు బయోపిక్ సినిమాలు కూడా ఫైల్ అయ్యాయి.అయిన కూడ అలుపెరగని పోరాటం చేస్తున్న బాలయ్య బాబు కి అఖండ సినిమా మళ్ళీ జీవం పోసింది.
ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీ తో వీర సింహ రెడ్డి ని సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య కు పోటీగా నిలబెట్టాడు.ఏ సినిమా ఎంత కలెక్షన్స్ సాధించింది అనే లెక్కల్లో ఎన్ని బొక్కలు ఉన్నా వీర సింహ రెడ్డి పర్వాలేదు అనిపించుకున్న మాట వాస్తవం.

ఇక ఈ దోవలోనే అహ ఓటిటి లో అస్టాపబుల్ షో ఫుల్ రక్తి కట్టిస్తుంది.ఈ షో లో బాలయ్య ఎపిసోడ్ వచ్చింది అంటే సర్వర్ క్రాష్ అయిపోతుంది.ఇలాంటి టైం లోనే బాలయ్య మరొక అడుగు ముందుకు వేశాడు.పెరుగుతున్న తన బ్రాండ్ వాల్యూ ప్రకారం కొత్త గా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారాడు.
మొన్న ఆ మధ్య సాయి ప్రియ కన్స్ట్రక్షన్ యాడ్ చేయగా, ఇప్పుడు వేగా జ్యువలర్స్ ప్రకటన చేయబోతున్నాడు.అయితే ఇప్పటి వరకు ఎంత మంది ఎన్ని విధాలుగా అడిగిన కూడా బాలయ్య ఎప్పుడు టీవీ లో కానీ ప్రకటనల్లో కానీ కనిపించలేదు.
తన తోటి హీరోలు చక చక నాలుగైదు బ్రాండ్స్ కి ఎండార్స్ చేస్తుంటే తను మాత్రం ఎప్పుడు ఒప్పుకోలేదు.కానీ ఇప్పుడు బాలకృష్ణ పోకడ మారుతుంది.ఆయన ఎలాంటి యాడ్ అయిన సరే డబ్బు దండిగా ఇస్తే ఒప్పుకుంటున్నాడు.

బాలకృష్ణ లో ఇంత పెద్ద మార్పుకు కారణం ఎంటా అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.అయితే బాలకృష్ణ ను వేగా జ్యువల్లర్స్ యాడ్ కోసం ఒప్పించింది మాత్రం తెలుగు ఇండస్ట్రీ లో అతి పెద్ద మీడియా ప్రకటనల ఏజెన్సీ శ్రేయాస్ మీడియా అని తెలుస్తుంది.ఈ సంస్థ చాలా పెద్ద యెత్తున ప్రకటనలను మీడియా ఫీల్డ్ లో సప్లయ్ చేస్తుంది.
ఈ సంస్థ అధినేత శ్రీనివాస్ కి బాలయ్య బాబు చాలా దగ్గర వ్యక్తి కావడం తో వేగా జ్యువలరీ ప్రకటన కోసం బాలయ్య ముందుకు వచ్చాడు.రానున్న రోజుల్లో మరి కొన్ని బ్రాండ్స్ కి బాలకృష్ణ ఎండార్స్ చేసిన ఆశ్చర్య పొనక్కర్లేదు.