టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే.డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.అలాగే సినిమా సినిమాకు ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరుగుతూనే ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే.
ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారు ప్రభాస్.

కాగా 2022 నుంచి గమనిస్తే, ప్రభాస్ నుంచి ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా వస్తుంది.2022 లో రాధేశ్యామ్(Radheshyam), 2023 లో ఆదిపురుష్, సలార్(Adipurush, Salar), 2024లో కల్కి (Kalki)సినిమాలతో ప్రభాస్ అలరించాడు.ఈ ఏడాది ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన కన్నప్ప సినిమా విడుదల కానుంది.
అలాగే మారుతి దర్శకత్వంలో చేస్తున్న ది రాజా సాబ్ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.రాజా సాబ్ సినిమాతో పాటు ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.
హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ(Raja Saab, Fauji)షూటింగ్ దశలో ఉన్నాయి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కమిటై ఉన్నాడు.

అలాగే సలార్2,కల్కి 2(Salar 2, Kalki 2) కూడా లైన్ లో ఉన్నాయి.ఇవి చాలవు అన్నట్టు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో సలార్ 2 తో పాటు మరో రెండు సినిమాలు సైన్ చేశాడు ప్రభాస్.వాటిలో ఒకటి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్న బ్రహ్మ రాక్షస కాగా, రెండోది లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ అని వినికిడి.
అంతేకాదు ఒక బాలీవుడ్ డైరెక్టర్ తో సైతం సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.అంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా ఎనిమిది భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి అన్నమాట.8 భారీ ప్రాజెక్ట్ లు అందులోను అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం ఇలా ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న ప్రభాస్ మాత్రం చాలా కూల్ గా ఉన్నారు.ఇలా ఇన్ని సినిమాలు చేయడం డార్లింగ్ కి మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పాలి.