టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలో ఒకరి తర్వాత ఒకరు మార్కెట్ పరంగా బౌండరీలు దాటేస్తున్నారు.ఒకరు నెలకొల్పిన రికార్డులను ఈజీగా బద్దలు కొడుతూ దూసుకుపోతున్నారు.
ముఖ్యంగా యుఎస్ లో తెలుగు హీరోలకు ఎప్పటి నుంచో మార్కెట్ ఉంది.అయితే కొన్ని సినిమాలు ఎవ్వరూ ఊహించని కొత్త మార్కెట్ లోకి కూడా చొచ్చుకెళ్లాయి.
అలా తెలుగు సినిమాలకు మార్కెట్ ఓపెన్ అయిన దేశాల్లో జపాన్(Japan) ఒకటి.బాహుబలి (Bahubali)సినిమా అదరగొట్టింది.
దీని తర్వాత ఆర్ఆర్ఆర్(RRR) ఇంకా పెద్ద విజయం సాధించింది.అక్కడ ఇండియన్ సినిమాలకు సంబంధించి అన్ని రికార్డులనూ అది బద్దలు కొట్టేసింది.

ఇవి రెండూ రాజమౌళి (Rajamouli)సినిమాలే అన్న సంగతి తెలిసిందే.అయితే బాహుబలి హీరో ప్రభాస్(Bahubali, Prabhas) నుంచి వచ్చిన చివరి సినిమా కల్కి సినిమాని జపనీస్ లో అనువదించి బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు.కానీ అది అక్కడ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.రిలీజ్ తర్వాత దాని గురించి పెద్దగా డిస్కషనే లేదని చెప్పాలి.అయితే ఇప్పుడు జపాన్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)సిద్ధమవుతున్నారు.
ఎన్టీఆర్ చివరి మూవీ దేవర జపనీస్(Devara Japanese) లో మార్చి 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టింది.

అయితే తాజాగా తారక్ జపాన్ అభిమానులతో ఆన్ లైన్లో వీడియో చిట్ చాట్ చేశాడు.త్వరలోనే తారక్ జపాన్‌కు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయనున్నాడట.తారక్ ఆర్ఆర్ఆర్ చేయడానికి ముందే జపాన్ లో కొంత గుర్తింపు సంపాదించాడు.అయితే కల్కి లాంటి విజువల్ వండర్ నే జపాన్ ప్రేక్షకులు పట్టించుకోని నేపథ్యంలో దేవర లాంటి మామూలు సినిమా అక్కడ ఆశించిన ఫలితాలను అందుకుంటుందా అన్నది సందేహం.
ఒకవేళ ఎన్టీఆర్ అక్కడ మార్కెట్ పెంచుకోవాలి అంటే ఇంకా ఏదైనా పెద్ద ఈవెంట్ తో వెళ్లాలి.దేవర మూవీ తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను తెచ్చుకుంది.
మరి అలాంటిది విదేశాల్లో ఈ సినిమా సత్తా చాటుతుందా అన్న విషయంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరి ఈ విషయంలో ప్రభాస్ కి సాధ్యం కానిది ఎన్టీఆర్ కు సాధ్యమవుతుందేమో చూడాలి మరి.