యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ కు డూప్ గా ఎవరు నటిస్తారనే విషయం చాలామందికి తెలియదు.
జూనియర్ ఎన్టీఆర్ కు బాడీ డబుల్ గా పని చేస్తున్న ఈశ్వర్ హారిస్( Eshwar Harris ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను ఆచార్య సినిమాలో చేశానని అయితే ఎడిటింగ్ లో ఆ ఫైట్ పోయిందని ఆయన తెలిపారు.
నాకు జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఉండటంతో రాజమౌళి టీం నా గురించి సెర్చ్ చేస్తోందని తెలిసిందని ఈశ్వర్ హారిస్ పేర్కొన్నారు.నేను 5 నిమిషాలు సెట్ ఆలస్యంగా వెళ్తే ఎక్కువ సంఖ్యలో కాల్స్ వచ్చాయని ఈశ్వర్ హారిస్ తెలిపారు.
రాజమౌళి సార్ షూట్ లో ఉదయం 6 గంటలకే షాట్ పడుతుందని ఆయన పేర్కొన్నారు.

రాజమౌళి షాట్ విషయంలో పర్టిక్యులర్ గా ఉంటారని ఈశ్వర్ హారిస్ వెల్లడించారు.ఆర్.ఆర్.ఆర్ లో( RRR ) కొమురం భీమ్ సాంగ్( Komuram Bheemudo Song ) లో బ్లడ్ కారే హ్యాండ్, లెగ్ షాట్స్ అన్నీ నావే అని ఆయన పేర్కొన్నారు.నేను స్టంట్స్ ఏం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.వార్2 సినిమాకు రెమ్యునరేషన్ కుదరలేదని బాలీవుడ్ వాళ్లు మనకంటే దారుణంగా ఉన్నారని ఈశ్వర్ హారిస్ పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ గారిని జెప్టో యాడ్ లో కలిశానని ఆయన తెలిపారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ జ్వరంతో బాధ పడుతున్నారని తెలిసిందని ఈశ్వర్ హారిస్ పేర్కొన్నారు.సందీప్ అనే క్యాస్టింగ్ డైరెక్టర్ ద్వారా జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ కు బాడీ డబుల్ గా ఛాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.జెప్టో వళ్లు నన్ను బాగా చూసుకున్నారని ఈశ్వర్ హారిస్ పేర్కొన్నారు.ఈశ్వర్ హారిస్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.