ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో శర వేగంగా విస్తరిస్తోంది.తగ్గింది అని అనుకునేలోనే ఈ మాయదారి వైరస్ మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది.
ఈ మహమ్మారి ఎప్పుడు ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు అల్లాడి పోతున్నారు.ఓవైపు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతున్నా కరోనా వేగం తగ్గడం లేదు.
ఇక కరోనా వైరస్ సోకిన వారిలో కొందరు హాస్పటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
మరి కొందరు హోమ్ క్వారంటైన్ అయ్యి డాక్టర్ల సలహాలు, సూచనల మేరకు మందులు వాడుతూ వైరస్‌ను జయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులందరితోనూ కలవకుండా ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పటు చేసుకుని అందులోనే ఉండాలి.
అలాగే వైరస్ సోకిన వ్యక్తి వాడే వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు తాకరాదు.
ముఖ్యంగా టూత్ బ్రెష్‌లు, పాత్రలు, బెడ్ షీట్స్, సోప్స్, టవల్స్, వేసుకునే బట్టలు ఇలాంటివేవి ఇతరులు తాకరాదు.ఇక కరోనా వచ్చిన వ్యక్తి చిన్న పిల్లలకి, ముసలి వారికి, గర్భిణీ స్త్రీలకి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధ పడే వారికి చాలా దూరంగా ఉండాలి.
కరోనా వచ్చి వ్యక్తి ఉండే గది, వాడిన వాష్ రూమ్, తిరిగే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరస్ పదార్థాలతో క్లీన్ చేస్తూ ఉండలి.ఇతరులతో మాట్లాడే సమయంలో దూరంగా ఉండటమే కాదు ఖచ్చితంగా మాస్క్ కూడా ధరించాలి.ఇక ఆహారంలో పప్పు, ధాన్యం, రాజ్మా, పెరుగు, తాజా పండ్లు, నట్స్, మాంసం, చేపలు, ఉడకబెట్టిన గుడ్లు, పాలు ఉండేలా చేసుకోవాలి.చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎవైడ్ చేయాలి.
గోరు వెచ్చని నీటిని తరచూ తీసుకోవాలి. మిరియాలు, పసుపు, అల్లం, దాల్చిన చెక్క, నిమ్మ వంటి వాటితో తయారు చేసి కషాయాలు తీసుకోవాలి.
కనీసం పావు గంట అయినా వ్యాయామం లేదా యోగా చేయాలి.