మన శరీరానికి పీచు అనేది చాలా అవసరం.సరైన మోతాదులో శరీరానికి పీచు అందితే పొట్టలో కదలికలు బాగా జరిగి మలబద్దకం సమస్య తగ్గుతుంది.
మన ఆహారంలో పీచు పదార్ధాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం.మనం తీసుకొనే ఆహారంలోనే కాస్త పీచు మన శరీరానికి అందుతుంది.
ఆలా కాకుండా పీచు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.పీచు అధికంగా ఉన్న ఆహారాలను గూర్చి తెలుసుకుందాం.
బియ్యం, గోధుమ, జొన్న, పప్పులు, ఓట్స్ వంటి వాటిలో పీచు అధికంగా ఉంటుంది.అయితే తెల్లని బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ లేదా తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ వంటివి మంచివి.బ్రౌన్ రైస్ లో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది.
బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయని భావిస్తారు.
కానీ బెర్రీ పండ్లలో పీచు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది.కాబట్టి స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు, లేదా రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి బాగా తినండి.
బీన్స్ అనేది పీచు అధికంగా ఉన్న ఆహారం.వీటిని వండిన తర్వాత కూడా పీచు అధిక మొత్తంలో ఉంటుంది.ఫ్రెంచి బీన్స్, కిడ్నీ బీన్స్ వీటిని అయినా తినవచ్చు.
గోంగూర, బచ్చలి, మెంతి, తోటకూర,చుక్కకూర వంటి ఆకుకూరల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది.
కాబట్టి ప్రతి రోజు ఆహారంలో భాగంగా ఆకుకూరలను చేసుకోవచ్చు.
కాయ ధాన్యాలు సైజులో చిన్నవైనప్పటికి అధిక పీచును కలిగి ఉంటాయి.కొద్దిగా తిన్నా వాటిలో వున్న కొవ్వు, ప్రొటీన్లు అధిక శక్తి నిస్తాయి.కాబట్టి ప్రతిరోజూ కొన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి తినండి.