బ్రేకింగ్ న్యూస్ రెడీ .. పవన్ కోసం నిమ్మగడ్డ పాట్లు

ప్రస్తుత రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, పలుకుబడి, పేరు ప్రతిష్టలు ఉంటె సరిపోదు.మనం ఏమి చేస్తున్నాము.

 Pawan Kalyan To Over The 10 Tv News Channel-TeluguStop.com

ఏమి చేయబోతున్నాము అనేది ప్రజల్లోకి వెళ్లకపోతే ఎంత చేసినా వృధానే అవుతుంది.అలా కాకుండా ఉండాలి అంటే మీడియా సపోర్ట్ కావాల్సిందే.

ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మీడియా ఛానెల్స్ మీద ఫోకస్ పెట్టాడు.ఆయన నేరుగా పెట్టుబడులు పెట్టకపోయినా ఆయన సన్నిహితుల ద్వారా ఆ కోరిక నెరవేర్చుకుంటున్నాడు.

ఈ కోవలోనే ఇప్పటికే పవన్ చేతిలో 99 టీవీ ఉంది.ఇది జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నడుస్తోంది.

ఇది కాకుండా ఇంకో ఛానెల్ కోసం పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇప్పుడు పవన్ కి అత్యంత సన్నిహితుడైన సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా తెలుగురాష్ట్రాల్లో సుపరిచితుడు అయిన నిమ్మగడ్డ ప్రసాద్ పవన్ దృష్టిలో పడ్డాడు.నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి ఎలా తీసుకురావడంతో.కొత్తగా పెట్టిన చానెల్‌ను అనతికాలంలోనే పాపులర్ చేయడంలో ఆయనది ప్రత్యేక శైలి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.ఆయన మరో చానెల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.నష్టాల్లో ఉన్న 10 టీవీ న్యూస్ చానెల్‌ను రూ.32 కోట్లకు ఆయన తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇందులో చిరంజీవికి కూడా భాగం ఉన్నట్లు సామ్యాచ్గారం.జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచేందుకే నిమ్మగడ్డ ప్రసాద్ దీనిని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10టీవీని ఆయన తీసుకున్నట్లు సమాచారం.నిజానికి, ఏపీలో రాజకీయంగానూ పవన్‌కు సీపీఎం పార్టీ మద్దతుగా నిలుస్తోంది.ఈ క్రమంలోనే వారిమధ్య డీల్ కుదిరిందనే టాక్ వినిపిస్తోంది.నిజానికి ఇప్పుడు ఏపీలో పవన్‌కు అండగా నిలిచే.ఆయన వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే న్యూస్ చానెల్ లేదు.రాజకీయాల్లో రాణించాలంటే ఒక పేపర్‌.

న్యూస్ ఛానెల్ ఉండాల్సిందేనని గ్రహించిన పవన్ ఇందుకు నిమ్మగడ్డ ప్రసాద్ కు ఆ బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube