దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఇది పెద్దలు ఎందుకు చెప్పారో తెలియదు కానీ.
నేటి రోజుల్లో హీరోయిన్స్ మాత్రం ఇది తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు.సినిమాల్లో మంచి క్రేజ్ ను ఉన్నప్పుడే.
వరుస అవకాశాలు వచ్చినప్పుడే.సినిమా ఇండస్ట్రీ మనను పట్టించుకున్నప్పుడే.
ఎంత కుదిరితే అంత సంపాదించడం బెటర్ అని అనుకుంటున్నారు సినిమా హీరోయిన్లు.ఒక వైపు సినిమాలు మరో వైపు కమర్షియల్ యాడ్స్.
ఇంకోవైపు బిజినెస్ ఇలా చెప్పుకుంటూ పోతే రెండు చేతులారా సంపాదిస్తున్నారు.తమకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నారు.
ఇలా ఇటీవలి కాలంలో ట్రోలింగ్ సైతం పట్టించుకోకుండా మాకు నచ్చినట్టు మేముంటాం.ఎవరి గురించి పట్టించుకోం అంటూ దూసుకుపోతున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు.
ఇక ఇలాంటి లిస్టులో సమంత మొదటి స్థానంలో ఉంది.సమంతకి ప్రమోషన్స్ కమర్షియల్ యాడ్స్, షాప్ ఓపెనింగ్ కొత్తేమీకాదు.
అంతే కాదు అందం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అటు మిగతా హీరోయిన్లకు ఒక సలహా కూడా ఇచ్చేసింది.ఇక ఇటీవల ఒక ఆల్కహాల్ యాడ్ లో కనిపించింది.
దీంతో కాస్త ట్రోలింగ్ వచ్చింది.అయినప్పటికీ ఇది పట్టించుకోలేదు సమంత.
ఇక ఇప్పుడు రష్మిక కూడా ఇదే దారిలో వెళ్తుంది.టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ఇటీవలే అండర్వేర్ యాడ్ లో నటించి ప్రేక్షకులను షాక్కు గురి చేసింది.ఆ తర్వాత కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.ఇక కోట్లు ఇస్తున్నారంటే ఎలాంటి పనైనా చేస్తావా అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది అభిమానులు తిట్టిపోశారు కూడా.
కేవలం సమంతా రష్మిక మాత్రమే కాదు పూజా హెగ్డే, నిధి అగర్వాల్, రెజినా పాయల్ రాజ్ పుత్,హన్సిక, ఇలియానా ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యానికి హాని కలిగించే బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి ఎంతో మంది హీరోయిన్లు సిద్ధమయ్యారు.అప్పట్లో కాజల్ అగర్వాల్ సైతం తన భర్త కిచ్లు తో కలిసి ఒక ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోట్ చేసింది.
కానీ సొసైటీకి మంచి చేయని బ్రాండ్ లకు మేము ఎప్పుడూ దూరంగా ఉంటామని కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇంకా మొండిపట్టు తోనే ఉన్నారు.
మాకు కోట్లు అవసరం లేదు ప్రేక్షకుల అభిమానం చాలు అంటున్నారు.అలాంటి సెకండ్ లిస్టు లో ఉన్న మొదటి పేరు సాయి పల్లవి.సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా అందాల ఆరబోతకు దూరంగానే ఉంటుంది.
అంతే కాదు ఆరోగ్యానికి హాని కలిగించే బ్రాండ్ ప్రమోషన్స్ కి ఎప్పుడు రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది.ఇక నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్లో ఎంతో సంతోషంగా గడుపుతుంది.
ఇక డబ్బు కోసం జనాల్ని మభ్యపెట్టి యాడ్స్ చేయకూడదని నా మెంటాలిటీ అంటూ సాయి పల్లవి పలుమార్లు చెప్పుకొచ్చారు.ఇలా వాణిజ్య ప్రకటనలతో కోట్ల రూపాయలు వస్తాయి అని తెలిసినప్పటికీ కూడా సాయి పల్లవి మాత్రం ఏ వాణిజ్య ప్రకటన చేయడానికి కూడా ఇప్పటివరకు ముందుకు రాలేదు.