అలాంటి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న కల్కి.. ఇప్పటివరకు జరగలేదంటూ?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో వినిపిస్తున్న పేరు కల్కి.నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Kalki- 2898 Ad Creates History In Single Day Bookings In India, Kalki Movie, Cre-TeluguStop.com

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు ఈ సినిమాకు క్యూ కడుతున్నారు.

కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ సెలబ్రిటీలు నటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాని ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో అయితే ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచే ఈ చిత్రానికి వచ్చాయి.అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తోంది.గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో( BookMyShow ) లో ఏకంగా 1.28 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి.

ఒక్క రోజులో 12 లక్షలకి పైగా బుకింగ్స్ ఒక సినిమాకి జరగడం అనేది ఇప్పటివరకు జరగలేదు.

మొదటిసారి కల్కి కి జరగడం హిస్టరీగా మారింది.మరి మున్ముందు కల్కి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి మరి.సినిమా విడుదలకు ముందే ఎన్నో రకాల రికార్డ్లను సృష్టించిన విషయం తెలిసిందే.ఇలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నడంతో ఇలాంటి రికార్డులు కేవలం మా డార్లింగ్ కి సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube