డిప్రెషన్ కు కారణాలు ఏంటి.. అసలు దాని నుంచి ఎలా బయటపడొచ్చు..?

డిప్రెషన్( Depression ).ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని వేధిస్తున్న సైలెంట్ కిల్లర్ ఇది.

 What Are The Causes Of Depression And How Can You Get Out Of It Depression, Depr-TeluguStop.com

స్థిరమైన దుఃఖాన్ని కలిగించే ఈ మానసిక సమస్య కారణంగా ఎంతో మంది ప్రాణాలను వదిలేస్తున్నారు.మరెంతో మంది జీవితాల‌ను కోల్పోతున్నారు.

ఈ నేపథ్యంలోనే డిప్రెషన్ బారిన పడటానికి కారణాలేంటి.? అసలు దాని నుంచి ఎలా బయటపడొచ్చు.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిప్రెషన్ అనేది ఒక సాధారణ మానసిక ఆరోగ్య పరిస్థితి.

ఇది మీరు ఆలోచించే, నిద్రించే, తినే మరియు ప్రవర్తించే విధానంలో అనేక‌ మార్పులను కలిగిస్తుంది.నిరంతరం విచారం మరియు కార్యకలాపాలపై ఆసక్తిని కోల్పోయే అనుభూతిని కలిగిస్తుంది.

డిప్రెషన్‌కు గల ఖచ్చితమైన కారణాలేమి లేవు.కానీ దాని అభివృద్ధికి అనేక అంశాలు దోహదం చేస్తాయి.

ముఖ్యంగా త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన వారిని కోల్పోవ‌డం, విడాకులు, ప్రేమ‌లో విఫ‌లం కావ‌డం, అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోవ‌డం, ఇత‌రుల చేతుల్లో మోసం పోవ‌డం, ఒంట‌రిత‌నం, ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ త‌దిత‌ర అంశాలు డిప్రెష‌న్ కు దారి తీస్తాయి.

Telugu Symptoms, Tips, Latest-Telugu Health

డిప్రెష‌న్ వ‌ల్ల నిత్యం విచారంగా, నిస్సహాయంగా, ఆందోళనగా ఉంటారు.హాయిగా నిద్ర‌పోలేరు.చేసే ప‌నిపై శ్ర‌ద్ధ పెట్ట‌లేరు.

ఆనంద క్ష‌ణాల‌ను ఆస్వాదించ‌లేరు.ఏకాగ్రత దెబ్బ తింటుంది.

చీటికీ మాటికీ చిరుకు ప‌డుతుంటారు.ఎమోష‌న్స్ ను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేరు.

తలనొప్పి, కడుపునొప్పి, లైంగిక కోరిక‌లు( Headache, stomach ache, sexual desire ) త‌గ్గిపోవ‌డం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు.స్వీయ-హాని లేదా ఆత్మహత్య ఆలోచనలు మైండ్ లో మెదులుతుంటాయి.

కొంద‌రు డిప్రెష‌న్ లో మునిగిపోయి చెడు వ్య‌స‌నాల‌కు బానిస అవుతుంటారు.చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు.

Telugu Symptoms, Tips, Latest-Telugu Health

ఇటువంటి ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తే క‌చ్చితంగా మీరు జాగ్ర‌త్త ప‌డాలి.డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి సైకోథెరపీ, బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ( Psychotherapy, brain stimulation therapy ) వంటి చికిత్స‌లు తీసుకోవాలి.అలాగే మీ జీవ‌న‌శైలిలో త‌ప్ప‌కుండా కొన్ని మార్పులు చేసుకోవాలి.డిప్రెషన్ దూరం కావాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.ఉద‌యాన్నే నిద్ర లేవ‌డానికి అల‌వాటు ప‌డాలి.హెర్బ‌ల్ టీతో డేను ప్రారంభించాలి.

నిత్యం ఉద‌యం అర‌గంట నుంచి గంట పాటు వ్యాయామం చేయాలి.క‌ష్ట‌మైనా స‌రే స్మోకింగ్, డ్రింకింగ్ అల‌వాట్ల‌కు స్వ‌స్థి ప‌ల‌కాలి.

ఖాళీగా కూర్చోవ‌డం మానేసి ఏదో ఒక ప‌ని చేస్తుండాలి.ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో టైమ్ స్పెండ్ చేయాలి.

మీ బాధ‌ల‌ను వారితో పంచుకోవాలి.సంగ‌తం విన‌డం, ప్ర‌కృతిని ఆస్వాదించ‌డం వంటివి చేయాలి.

ఈ చిన్న చిన్న మార్పులు మీ మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.డిప్రెష‌న్ నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డేందుకు తోడ్ప‌డతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube