పొడి చర్మం(డ్రై స్కిన్).స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామన్‌గా ఎదుర్కొనే సమస్యల్లో ఇదీ ఒకటి.
ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకున్నా మళ్లీ కొన్ని గంటలకే చర్మం పొడిగా మారిపోతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియక, ఈ సమస్యను ఎలా నివారించుకోవాలో అర్థంగాక తెగ సతమతమవుతుంటారు.
అయితే పొడి చర్మాన్ని నివారించడంలో పొద్దుతిరుగుడు నూనె అద్భుతంగా సమాయపడుతుంది.పొద్దుతిరుగుడు గింజల నుండి తయారు చేసే ఈ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.
ఇది చర్మంపై తేమను బంధించి పొడి బారకుండా అడ్డు కట్ట వేస్తుంది.మరి ఇంతకీ చర్మానికి పొద్దుతిరుగుడు నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల పొద్దుతిరుగుడు నూనె, ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడతో పాటు కావాలనుకుంటే చేతులకు కూడా అప్లై చేసుకుని కాసేపు డ్రై అవ్వనివ్వండి.
అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే పొడి చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.
అలాగే పొద్దుతిరుగుడు నూనెను నేరుగా సైతం చర్మానికి అప్లై చేయవచ్చు.చేతిలోకి కొద్దిగా నూనెను తీసుకుంటే ముఖానికి, మెడకు అప్లై చేసి సర్కిలర్ మోషన్‌లో కాసేపు మసాజ్ చేసుకోవాలి.అనంతరం ఇరవై, ముప్పై నిమిషాలు ఆరనిచ్చి ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా కూడా స్కిన్ డ్రై అవ్వకుండా తేమగా ఉంటుంది.
అంతేకాదు, చర్మానికి పొద్దు తిరుగుడు నూనెను అప్లై చేయడం వల్ల ముడతలు, నల్లటి మచ్చలు తగ్గు ముఖం పడతాయి.చర్మ ఛాయ పెరుగుతుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.మరియు చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది.