1.ఎంపీ అరవింద్ పై కవిత సంచలన కామెంట్స్
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతాను అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్ చేశారు.
2.ఆక్వా రైతుల కీలక నిర్ణయం
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని కోరారు.నిపుణుల సూచన మేరకు ఆక్వా రంగంలో క్రాప్ హాలిడే నిర్ణయాన్ని రైతులు విరమించుకున్నారు.
3.ఈడి ముందు హాజరైన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ
కే శీను కేసులు నేడు ఈడి అధికారులు విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరయ్యారు.
4.లిక్కర్ స్కాం పై జివిఎల్ కామెంట్స్
బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన లిక్కర్ స్కాం లో విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి డబ్బులు తరలించారు అని జివిఎల్ కామెంట్ చేశారు.
5.పెద్దపులి సంచారం
అదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకాలం సృష్టిస్తోంది.తాజాగా కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో పెద్దపులి సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
6.నవజీవన్ ఎక్స్ప్రెస్ లో మంటలు
తిరుపతి జిల్లా గూడూరు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.
7.మహిళ శిశు సంక్షేమ శాఖపై జగన్ సమీక్ష
నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
8.రాకెట్ ప్రయోగించిన ఇస్రో
శ్రీహరికోట నుంచి ఈరోజు ఉదయం 11:30 గంటలకు మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రం ఎస్ ను ఇస్రో ప్రయోగించింది.
9.మెగా జాబ్ మేళా
నేడు బాపట్ల మండలం కాజీ పాలెం లోని కెవిఆర్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఏపీ స్టీల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మెగా జాబ్ నిర్వహించారు.
10.రోడ్ల మరమ్మతులపై కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాబినెట్ మంత్రులు రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.వచ్చే నెల రెండో వారం లోపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
11.జనసేన ను అడ్డుకుంటే సహించేది లేదు : బిజెపి
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోమని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
12.రాజ్ భవన్ నుంచి హరీష్ రావుకు పిలుపు
మంత్రి హరీష్ రావుకు రాజ్ భవన్ నుంచి పిలుపు వచ్చింది.మెడికల్ టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయసు పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్ తమిళ సై అసంతృప్తితో ఉండడంతోనే, ఈ పిలుపు వచ్చినట్లు సమాచారం.
13.కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.” కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చినయ్ రమ్మని చెప్పిన కొంతమంది రావడం లేదు.కేసిఆర్ గర్జుండి డబ్బులు పంపిస్తున్నట్టుంది.రాని వాళ్ళు చెక్కులు క్యాన్సిల్ చేస్తా.అన్ని పథకాలు కావాలంటారు మాకు మాత్రం ఓటేయరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
14.హైదరాబాద్ కు చేరుకున్న సిట్ అధికారులు
నల్గొండ ఎస్పీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు కేరళలో ఉన్న సిట్ అధికారులు నేడు హైదరాబాద్ కు చేరుకున్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనుమానితులుగా ఉన్న తుషార్ తో పాటు, జగ్గుసామి ఇళ్ళు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
15.ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత
బిజెపి ఎంపీ ధర్మపురి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.టిఆర్ఎస్ కార్యకర్తలు అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
16.సిద్ధ, ఆయుర్వేద కోర్సుల ర్యాంకుల జాబితా విడుదల
ఆయుర్వేద సిద్ధ, యునాని ,హోమియోపతి కోర్సులకు సంబంధించిన ర్యాంకుల జాబితాను తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యం విడుదల చేశారు.
17.ఐ ఎస్ టి డి లో పీజీ డిప్లమో
ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
18.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు స్వామి వారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
19.దళిత బందుకు ఎమ్మెల్యే సిఫార్సు అక్కరలేదు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కింద లబ్ధి పొందడానికి స్థానిక ఎమ్మెల్యే ఆమోదం కానీ, సిఫార్సు కానీ అక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
20.సరాస్ 2022 ఎగ్జిబిషన్
సరాస్ 2022 ఎగ్జిబిషన్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు మహిళా స్వయం సహాయక సంఘాలు రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనను హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా ల ఏర్పాటు చేశారు.