ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యానికి గురి అవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈయన గత కొంతకాలంగా తీవ్రమైన జ్వరం ఇతర అనారోగ్య సమస్యలతో ( Health Issues ) బాధపడుతున్నారు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్( Cabinet Meeting ) కోసం హైదరాబాద్ నుంచి ఏపీ సచివాలయానికి వచ్చారు.కానీ ఆయన మాత్రం క్యాబినెట్ మీటింగ్లో పాల్గొనలేకపోయారు.
తీవ్రమైన జ్వరంతో బాధపడిన నేపథ్యంలో క్యాబినెట్ మీటింగ్ కు దూరంగా ఉన్నారు.ఇలా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ కి రాకుండా తిరిగి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లడంతో పవన్ ఆరోగ్యం పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్ పెట్టుకొని కనిపించారు.ఇలా పవన్ కళ్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్ ఉండడంతో ఈయన తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని స్పష్టం అవుతుంది.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై( Pawan Kalyan Health ) ఆందోళన చెందటమే కాకుండా కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమంటూ సలహాలు ఇస్తున్నారు.ఇక పవన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్వరంతోపాటు స్పాండిలైటిస్ అనే సమస్యతో బాధపడిన సంగతి తెలిసిందే.

ఇలా పవన్ కళ్యాణ్ తరచు అనారోగ్యానికి గురి అవుతున్న నేపథ్యంలో అభిమానులు మాత్రమే కాదు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్( Bandla Ganesh ) సైతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందిస్తూ ఈయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.పని అంటే మీరు ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు.నడుము విరిగిపోయినా గుర్రపు మీద స్వారీ చేస్తారు.103 జ్వరం ఉన్నా డాన్సులు చేస్తారు.మీకు ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త పవన్ సర్ అంటూ ఈయన ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.