గంగవ్వ (Gangavva) పరిచయం అవసరం లేని పేరు మై విలేజ్ షో (My Village Show)అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ఫేమస్ అయ్యారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పల్లెటూరుకు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున అందరిని సందడి చేయడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే ఎంతో ఫేమస్ అయ్యారు.ఇలా గంగవ్వకు ఉన్న క్రేజ్ తో ఏకంగా బిగ్ బాస్ (Bigg Boss) ,సినిమా అవకాశాలను కూడా సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా గంగవ్వ నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక గంగవ్వ అంటేనే అందరికీ ఒక సాంప్రదాయమైన కట్టుబొట్టు గుర్తుకు వస్తుంది.ఎంతో చక్కగా చీర కట్టుకొని జుట్టు ముడి వేసుకొని చక్కగా పువ్వులు, నుదిటిపై బొట్టు పెట్టుకొని ఈమె కనిపిస్తారు.గంగవ్వని చూస్తే మన ఇంట్లో అమ్మమ్మ లేదా నాన్నమ్మని చూసిన అనుభూతి కలుగుతుంది.
అయితే తాజాగా గంగవ్వకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.అసలు ఏంటి గంగవ్వ ఇలా మారిపోయారు ఇక్కడ ఉన్నది గంగవ్వనేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎప్పుడూ ఒకే విధమైనటువంటి లుక్ లో కనిపించే గంగవ్వ తాజాగా సరికొత్త లుక్ లో కనిపించారు.తాజాగా గంగవ్వ ఓ సెలూన్ షాప్ కి వెళ్ళారని తెలుస్తుంది.అక్కడ గంగవ్వ తన జుట్టుకు స్ట్రెయిటినింగ్ చేయించుకుంది.
పనిలో పనిగా తన హెయిర్ కు బ్లాక్ కలర్ వేసుకుంది.కాలికి పెడిక్యూర్ కూడా చేసుకుంది.
గంగవ్వ తన హెయిర్ ను లూజుగా వదిలేసి సరికొత్త లుక్ లోకి మారిపోయింది.ఇలా గంగవ్వకు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అలాగే ఈ ఫోటోలలో ఆమె ముఖంపై ముడతలు కూడా తక్కువగా కనిపించడంతో కాస్త యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు దీంతో అభిమానులు గంగవ్వ ఫోటోలపై విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.