ఎండాకాలం లో వేడి తాపాన్ని భరించలేక దాదాపు చాలా మంది ప్రజలు ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.అలాగే ఈ సీజన్ లో చాలా మంది ప్రజలు ఐస్ క్రీమ్( Ice Cream ) తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఇది తినడానికి చాలా రుచిగా ఉండడంతో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఐస్ క్రీమ్ ను ఇష్టంగా తింటూ ఉంటారు.అయితే కొంత మంది ఐస్ క్రీమ్ అసలు తినకూడదు.
ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు అసలు ఐస్ క్రీమ్ తినకూడదు.దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు( Health Problems ) వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కానీ ఐస్ క్రీమ్ మనం అనుకున్నంత చెడ్డది ఏమి కాదు.
ఇది ఆరోగ్యానికి మంచిదని ఒక సర్వేలో తెలిసింది.ముఖ్యంగా చెప్పాలంటే కాల్షియం, మెగ్నీషియం,బీ12 విటమిన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా పాలు, క్రీమ్( Milk,Cream ) అనేది ఐస్ క్రీమ్ లో అధికంగా ఉంటుంది.ఇందులో ఉండే విటమిన్ ఎ,కోలీన్ను కలిగి ఉంటుంది.
ఇది కంటి చూపు( Eye Sight ) మెరుగుపరచడం రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.అంతే కాకుండా ఐస్ క్రీమ్ తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.అలాగే మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.శరీరానికి హైడ్రేషన్ అందించడం, జీర్ణశక్తి( Digestion ) మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.అందువల్ల ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ తక్కువగా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా నాన్ డైరీ ఉత్పత్తులను గుర్తించి మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఎంపిక చేసుకోవాలి.
లేకపోతే ఆరోగ్య సమస్యలను బారిన పడే అవకాశం ఉంది.ఐస్ క్రీమ్ అనే కాకుండా ఏ ఆహార పదార్థాన్ని అయినా తక్కువగా తీసుకోవడం మంచిది.