శరీరంలో వేడి ఎక్కువ( body heat ) అయితే ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా కడుపులో నొప్పి, కడుపులో మంట, చర్మంపై మొటిమలు రావడం, జుట్టు గ్రే కలర్ లోకి మారడం, హెయిర్ ఫాల్, డయేరియా, విపరీతమైన తలనొప్పి తదితర సమస్యలన్నీ ఇబ్బంది పెడుతుంటాయి.
దాంతో శరీరంలో అధిక వేడిని తొలగించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్టివ్ చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా శరీరంలో అధిక వేడిని మాయం చేయవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బకెట్ లో సగం వరకు వాటర్ తీసుకుని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ ( Ice cubes )తో పాటు ఒక కప్పు రోజ్ వాటర్( Rose water ) వేసి బాగా కలపాలి.ఈ వాటర్ లో పాదాలను కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.ఇలా చేయడం వల్ల శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.
అలాగే అధిక వేడి సమస్యతో బాధపడుతున్న వారు సపోటా, కర్బూజ, పుచ్చకాయ వంటి పండ్లను తీసుకోవాలి.ఇవి హీట్ ను తొలగించి బాడీని కూల్ గా మార్చడానికి గ్రేట్ గా సహాయపడతాయి.

అలాగే చందనం బాడీ హీట్ ను మాయం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.సహజ సిద్ధమైన చందనం పొడిలో కొద్దిగా వాటర్ లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి నుదుటిపై అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసిన మంచి ఫలితం ఉంటుంది.అధిక వేడి సమస్యతో బాధపడుతున్న వారు ఒక గ్లాస్ మజ్జిగలో వన్ టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు పుదీనా జ్యూస్, చిటికెడు పింక్ సాల్ట్, చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని బాగా మిక్స్ చేసి సేవించాలి.ఈ డ్రింక్ ను రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే శరీరంలో అధిక వేడి దెబ్బకు పరార్ అవుతుంది.
బాడీ సూపర్ కూల్ గా మారుతుంది.







