వేసవికాలం లో కీరదోసకాయ వలన ఎన్ని ప్రయోజానాలో తెలుసా?

ప్రస్తుతం వేసవికాలం మొదలై ఎండలు బాగా మండుతున్నాయి.అలాగే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది.

 Do You Know How Many Benefits Of Cucumber In Summer , Cucumber , Hydrate , Summ-TeluguStop.com

ఈ ఎండల వలన శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోతూ ఉంది.దీంతో శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుంది.

దీని ద్వారా మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాం.అందుకే ఈ సీజన్లో శరీరాన్ని చల్లగా ఉంచేలా ఆహారాన్ని తీసుకోవాలి.

కొన్ని రకాల పండ్లు, కూరగాయల్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది.

అందుకే అలాంటి కూరగాయలను తీసుకోవడం మంచిది.

అయితే అలాంటి కూరగాయల్లో కీరదోసకాయ కూడా ఒకటి.వేసవికాలంలో కీరదోసకాయను(Cucumber) తప్పనిసరి తీసుకోవాలి.

ఎందుకంటే ఇది శరీరాన్ని నిర్విషికరణ చేస్తుంది.అలాగే లోపల నుంచి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

అదేవిధంగా చర్మాన్ని ఆరోగ్యంగా, రిఫ్రెష్ గా ఉంచుతుంది.అలాగే వేసవికాలంలో ఈ కీరదోసకాయను తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Pressure, Cancer, Cucumber, Tips, Hydrate-Telugu Health Tips

కీరదోసకాయల్లో దాదాపు 95% వాటర్ కంటెంట్ ఉంటుంది.ఇవి శరీరంలోని విషాన్ని కూడా తొలగిస్తాయి.అంతేకాకుండా శరీరాన్ని బాగా హైడ్రేట్ చేసి పోషణకు సహాయపడతాయి.కీర దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బాడీ క్లెన్సర్ గా కూడా పనిచేస్తుంది.అదే విధంగా (Hydrate)శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను కూడా తొలగించడానికి ఇది సహాయపడుతుంది.కుకుర్బిటాసిన్ బి అనే సహజ పదార్థం దోసకాయలలో విరివిగా ఉంటుంది.

దీనికి క్యాన్సర్ ( Cancer )ను నిరోధించే సామర్థ్యం ఉంది.

Telugu Pressure, Cancer, Cucumber, Tips, Hydrate-Telugu Health Tips

అదేవిధంగా దోసకాయ తొక్క డైటరీ ఫైబర్ కు కూడా మంచి మూలం అని చెప్పాలి.అదేవిధంగా మలబద్ధకానికి తగ్గించడానికి కూడా కీర దోసకాయ సహాయపడుతుంది.అలాగే ఉదరం నుంచి విష సమ్మేళనాలను తొలగిస్తుంది.

అంతేకాకుండా పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పును కూడా ఇది తగ్గిస్తుంది.ఈ దోసకాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

అందుకే ఇది రక్త పోటును తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube