వావ్, ఒలింపిక్-స్టైల్‌లో జిమ్నాస్టిక్ చేసిన కెనడియన్ తల్లి.. వీడియో వైరల్..

ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్( Olympic Games ) క్రీడలు కొనసాగుతున్నాయి.అత్యంత ప్రతిభగల క్రీడాకారుల తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

అయితే ఈ ప్రొఫెషనల్ ప్లేయర్లు మాత్రమే కాదు కొంతమంది సామాన్యులు కూడా తమలోని క్రీడాకారుడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.కెనడా దేశానికి చెందిన ఒక అమ్మ కూడా ఒలింపిక్స్‌లో లాగా ఆటలు ఆడాలనుంది.

సిమోన్ బైల్స్ లాంటి ప్రముఖ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి కాకపోయినా, ఎవరైనా అద్భుతమైన జిమ్నాస్టిక్స్ చేయవచ్చని ఆమె చేసి చూపించింది.తన ఇంటి వంటగదిలోనే ఆమె కొన్ని అద్భుతమైన జిమ్నాస్టిక్స్ ట్రిక్స్ చేసి, దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఆ తల్లి పేరు బ్రెయిన్ అల్లరీ( Breanneallarie ).కొన్ని రోజుల క్రితం, ఆ తల్లి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.2024 పారిస్ ఒలింపిక్స్ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఆ వీడియోను లైక్ చేసింది.ఆ వీడియోలో ఆమె తన కిచెన్‌ను జిమ్‌లా మార్చింది.ఆమె స్విమ్‌సుట్ వేసుకుని, జిమ్‌లో ఉండే బార్లకు బదులుగా సోఫా కుషన్లను ఉపయోగించింది.ఒక రియల్ ఒలింపిక్స్ క్రీడాకారిణిలాగానే ఆమె జిమ్నాస్టిక్స్ ( Gymnastics )చేసింది.

నేను బ్యాక్‌ఫ్లిప్ కూడా చేయగలను అనిపిస్తుంది.ఒలింపిక్స్‌లో క్రీడాకారులు చాలా సులభంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది కానీ అంత సులభం కాదు.నేను ఒలింపిక్స్ చూస్తుంటే నేను కూడా ఒక క్రీడాకారిణి అయితే బాగుండు అనిపిస్తుంది” అని ఆమె తన పోస్ట్‌లో రాసింది.

ఆమె వీడియో చూసిన వాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.మరొకరు “మీరు చేసిన స్విచ్ స్ప్లిట్ చాలా బాగుంది” అని రాశారు.”నేను జిమ్నాస్టిక్స్‌లో నేషనల్ లెవెల్ కంటెస్టెంట్‌గా ఉన్నాను.మీరు అద్భుతంగా చేశారు” అని మరొకరు రాశారు.“మీకు జిమ్నాస్టిక్స్ లేదా డాన్స్ నేపథ్యం ఉండాలి.ఎందుకంటే మీరు చాలా బాగా చేశారు” అని మరొకరు అన్నారు.14 ఏళ్ల వరకు జిమ్నాస్టిక్స్‌లో చాలా కష్టపడిన ఈ తల్లి ఒలింపిక్స్‌కు వెళ్లాలని కోరుకుంది కానీ తన వెన్నుకు తీవ్రమైన గాయం అయ్యింది.కోలుకున్న తర్వాత ప్రొఫెషనల్ డాన్సర్‌గా మారింది కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఆపేసింది.ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ తాను వీడియోలో చేసిన స్టెప్స్ గురించి చెప్పింది.“నేను గాలిలోకి దూకి ప్లాట్‌గా పడిపోయే స్టెప్ అది.అందరూ నన్ను బెల్లీ ఫ్లాప్ చేస్తున్నావు అన్నారు.కానీ అది ‘షుషునోవా‘ అనే జిమ్నాస్టిక్స్ మూవ్” అని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube