అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్( Allu Sirish ) ఈరోజు కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా పేరు “బడ్డీ”.
( Buddy Movie ) ఇది ఒక యాక్షన్ కామెడీ చిత్రం.శాన్ అంటోన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
శిరీష్ ఈ మూవీ టికెట్లను అందుబాటు ధరల్లో ఉంచుతానని ఇంతకుముందు ప్రకటించాడు.ఈ రోజుల్లో చాలామంది ఫస్ట్ డేస్‌లోనే టికెట్ రేట్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది అని భావిస్తున్నారు.
ఫస్ట్, సెకండ్ డేలలో వచ్చిన కాడికి కుమ్ముకొని బడ్జెట్ తిరిగి రాబట్టాలని కోరుకుంటున్నారు అల్లు శిరీష్ మాత్రం టికెట్లు తగ్గించి తప్పు చేశాడు.బిజినెస్ మాస్టర్ మైండ్ అయిన అల్లు అరవింద్ కి తగిన కుమారుడు అనిపించుకోలేదు.
బడ్డీ సినిమా ఆకట్టుకునే కథనం, బలమైన స్క్రీన్‌ప్లే, గుర్తుండిపోయే సన్నివేశాలు లేక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.శిరీష్ కెరీర్‌లో ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు.టికెట్లు తగ్గింపు అనేది ఒక మంచి నిర్ణయమే కావచ్చు కానీ కంటెంట్ బాగుంటేనే టికెట్లు కొనుగోలు చేస్తారు ఆ లాజిక్ శిరీష్ మిస్ అయినట్లు ఉన్నాడు.బడ్డీ మూవీలో దమ్ము లేదు.
శిరీష్ 11 ఏళ్లుగా మూవీ ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి కష్టపడుతున్నాడు.కెరీర్‌లో జస్ట్, 7 సినిమాలు మాత్రమే తీశాడు.అంత టైం తీసుకొని సినిమాలు చేసినా ఒక్కటి కూడా హిట్ కాలేదు.గౌరవం (2013)తో ఈ హీరో కెరీర్ ప్రారంభించాడు.బన్నీ పుష్ప( Pushpa ) సినిమాతో పాన్ స్టార్ అయిపోయాడు.అల్లు శిరీష్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కెరీర్లో కొంచెం కూడా ముందుకు వెళ్లలేకపోయాడు.
నిజానికి వీరిద్దరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ సేమ్.ఇండస్ట్రీలో ఎవరికీ లేని బ్యాక్‌గ్రౌండ్ వీళ్ళకి ఉంది.
అల్లు అరవింద్( Allu Aravind ) ఏ సినిమా హిట్ అవుతుందో ఏది కాదో చెప్పగల అనుభవం ఉన్న నిర్మాత.చిరంజీవికీ( Chiranjeevi ) మంచి అనుభవం ఉంది.
శిరీష్ రామ్ చరణ్, బన్నీ హెల్ప్ కూడా తీసుకొని ఒక హిట్టు కొట్టవచ్చు.
అయితే శిరీష్ ఇలాంటి హిట్స్ కోసం పాకులాడటం లేదని అతని మూవీలను చూస్తుంటే అర్థమవుతుంది.కమర్షియల్ మూవీలకు భిన్నంగా ఇతడు డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.కానీ ఒక సినిమా కూడా హిట్ కాకపోవడం అతని దురదృష్టం.
ప్రూవ్డ్ సబ్జెక్టులైన రీమేక్స్ కూడా తీశాడు కానీ చేతులు కాల్చుకున్నాడు.శిరీష్ “ఊర్వశివో రాక్షశివో”( Urvasivo Rakshasivo ) సినిమాతో 2022లో పలకరించాడు.అయితే ఈ మూవీ రూ.8 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేయలేకపోయింది.అంతకుముందు సినిమాలు కూడా శిరీష్‌ను హీరోగా నిలబెట్టలేకపోయాయి.ఇప్పుడు సినిమా కూడా అతనికి నిరాశే మిగిల్చింది.చూస్తుంటే అతనికి ఈ సినిమా ఇండస్ట్రీ కలిసి రాలేదేమో అనిపిస్తుంది.
తమిళంలో వచ్చిన టెడ్డీకి( Teddy ) బడ్డీ రీమేక్ కాదు అని శిరీష్ ప్రమోషన్స్ సమయంలో తెలిపాడు.టెడ్డీ బేర్‌లోకి ఆత్మ రావడం అనేది తప్ప మిగతా మొత్తం స్టోరీ పూర్తిగా బుడం గా ఉంటుంది అన్నాడు.అయితే అదే మెయిన్ పాయింట్ కాబట్టి బడ్డీలో కొత్తగా ఏమీ లేదని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.
ఇంకో దురదృష్టం ఏంటంటే టెడ్డీ తమిళ సినిమా ఆల్రెడీ తెలుగులోకి కూడా డబ్ అయింది.చాలామంది దాన్ని చూసేసారు కాబట్టి టెడ్డీని ఎవరూ చూడడానికి ఆసక్తి కనపరచడం లేదు.