ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ‘గుంటూరు కారం’ సినిమాతో బాగా చాలా వరకు వెనుకబడిపోయాడు.తన సమకాలీన దర్శకులందరూ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం ఇంకా తెలుగులోనే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అల్లరించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అలా వైకుంఠపురం లో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో మాత్రం చతికల పడిపోయాడు.ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో( Allu Arjun ) మరొక సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నప్పటికీ దానిమీద త్రివిక్రమ్ ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.
ఇక ప్రస్తుతం ఆయన కొన్ని కథలను రాసే పనులు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే దాని పైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది… అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కనక సూపర్ హిట్ అయితే త్రివిక్రమ్ తో ఇప్పుడు సినిమా చేసే ఆలోచనను తను మానుకుంటాడు.ఎందుకంటే తనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.కాబట్టి త్రివిక్రమ్ కి పాన్ ఇండియా మార్కెట్ లేదు కాబట్టి ఆయనతో సినిమా చేసే అవకాశాలైతే ఉండవు.
కాబట్టి త్రివిక్రమ్ కూడా మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని( NTR ) రంగం లోకి దింపబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘అరవింద సమేత వీర రాఘవ’ లాంటి సూపర్ హిట్ సినిమా రావడం విశేషం… ఇక అదే సక్సెస్ ను మరోసారి కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యం తో వీళ్లు మరోసారి చేతులు కలపబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…
.