టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మన అందరికి తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు తో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్.
ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూనే మరోవైపు వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
![Telugu Devara, Janvi Kapoor, Jr Ntr, Koratala Shiva, Tollywood, War-Movie Telugu Devara, Janvi Kapoor, Jr Ntr, Koratala Shiva, Tollywood, War-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/devara-jr-ntr-janvi-kapoor-koratala-shiva-tollywood-social-media.jpg)
అయితే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.అయితే అభిమానులు ఈ సినిమాపై ఎన్నో రకాల కలలు కంటుండగా చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు.ముఖ్యంగా ఈ సినిమాను మూవీ మేకర్ సీరియస్గా తీసుకోలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటి వరకు ఒక చిన్న గ్లింప్స్, ఒక పాట తప్ప మరో వర్క్ ఏదీ బయటకు రాలేదు.ట్రయిలర్, టీజర్ అనేవి సెప్టెంబర్ వరకు ఎలాగూ రావు.
ఇక ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )ల పోస్టర్లు మాత్రమే విడుదల చేశారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన తొలి పాట మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ పాట పరవాలేదు అనిపించుకుంది.
![Telugu Devara, Janvi Kapoor, Jr Ntr, Koratala Shiva, Tollywood, War-Movie Telugu Devara, Janvi Kapoor, Jr Ntr, Koratala Shiva, Tollywood, War-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/devara-ntr-janvi-kapoor-koratala-shiva-tollywood-social-media.jpg)
ఇక తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా జులై చివరి వారంలో ఇస్తారు అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి.కానీ అది కాస్తా దాటిపోయింది.జులై నెలాఖారు కాస్తా అగస్ట్ తొలివారానికి వచ్చింది.
తొలివారం పూర్తి అవ్వడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది.మరి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు.
ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ అప్ డేట్ నో రామచంద్రా అంటూ గోల పెడుతున్నారు.దీంతో చిత్ర యూనిట్ పై కోపంగా ఉన్నారు అభిమానులు.
అలాగే కొరటాల మీద వదిలేసారో, లేదా హీరో తానే సీరియస్ గా తీసుకోవడం లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మొత్తం మీద దేవర సినిమా బజ్ పెంచుకోవడంలో దారుణంగా వెనుకపడింది అన్నది మాత్రం వాస్తవం అని చెప్పాలి.