ముఖ్యంగా చెప్పాలంటే వేసవికాలం( Summer )లో వేడి శరీరం మీద కంటే పేదాల మీద భిన్నమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది.అలాగే పెదవులలో రక్త ప్రవాహాన్ని పెంచే రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే మన పెదవులు గులాబీ లేదా ఊదా రంగులో ఉంటాయి.లిప్స్ మీద ఉండే ఎపిడెర్మిస్ లేదా బయట పోరా ద్వారా అవి రక్షించబడతాయి.
అలాగే ఎక్కువగా సూర్యరశ్మి కింది పెదవికి తగులుతుంది.ఇతర శరీర భాగాల మాదిరిగానే యూవీ రేడియేషన్ కాలక్రమేణా చర్మ కణాల డీఎన్ఏ ని దెబ్బతీస్తుంది.
పెదాలు సూర్య సూర్యరశ్మికి గురైనప్పుడు రెండు నుంచి ఐదు గంటల లోపు కొన్ని లక్షణాలు చూపిస్తుంది.సున్నితత్వం, పొడి బారిపోవడం, బిగుతుగా మారడం, తేలికపాటి వాపు, ఎండలో కాలిపోయినట్లు ఉండడం పెదవులలలో ఉండే లక్షణాలు.
వడదెబ్బ తగిలినప్పుడు పెదాలకు తప్పనిసరిగా చికిత్స చేయాలి.చల్లగా ఉండే లేపనాలతో చికిత్స చేస్తే మంచిది.
అలాగే పెదవుల వేడి అనుభూతిని తగ్గించుకొందుకు కోల్డ్ కంప్రెస్ ఉపయోగించవచ్చు.మెత్తని వాష్ క్లాత్ తీసుకొని చల్లని నీటిలో కడిగి పెదాల మీద మెత్తగా మర్దన చేసుకోవాలి. ఐస్ వాటర్( Ice water ) లో ముంచి రుద్దితే పెదాలకు ఎంతో మంచిది.కానీ వాటి మీద నేరుగా ఐస్ పెట్టకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆకును కట్ చేసి పెదవుల పై అప్లై చేసుకోవచ్చు.లేదంటే బయట షాప్ లో దొరికే అలోవెరా జెల్ కొనుగోలు చేసుకుని ఎప్పుడూ బ్యాగ్ లో ఉంచుకోవడం మంచిది.
ఇంకా చెప్పాలంటే గ్లిజరిన్ ( Glycerin )పెదవులను మృదువుగా, హైడ్రేట్ గా ఉంచుతుంది.పొడిబారిన పెదవులను మెత్తగా మారుస్తుంది.అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ ఉండే కొబ్బరి నూనెలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది.ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పెదవుల మంటను,పగుళ్ల ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.