ఇంట్లో సింపుల్‌గా కాటుక‌ను ఎలా త‌యారు చేసుకోవ‌చ్చో తెలుసా?

కాటుక క‌ళ్ళు. ఎంత బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా క‌నిపిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 How To Make Natural Kajal At Home! Natural Kajal, Eye Kajal, Latest News, Katuka-TeluguStop.com

పైగా కాటుక పెట్టుకోవ‌డం వ‌ల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది.కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి.

క‌ళ్ళ‌ మంట‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ కాటుక‌ ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రియు కాటుక వల్ల కళ్ళు పెద్దగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

అందుకే చాలా మంది అమ్మాయిలు ప్ర‌తి రోజు క‌ళ్ళ‌కు కాటుక‌ను పెట్టుకుంటారు.

అయితే బయట దొరికే కాటుకల్లో ఎన్నో ర‌సాయ‌నాలు నిండి ఉంటాయి.

అందం విష‌యం ప‌క్క‌న పెడితే అటు వంటి కాటుక‌ల‌ను వాడ‌టం వ‌ల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.అందుకే ఇంట్లో త‌యారు చేసిన న్యాచుర‌ల్ కాటుక‌ల‌నే వాడాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రి ఆల‌స్య‌మెందుకు ఇంట్లో సింపుల్‌గా మ‌రియు ఫాస్ట్‌గా కాటుక‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్‌లో బాదం పప్పుల్ని వేసి.

కాస్త ఎత్తులో కాప‌ర్ ప్లేట్‌ బోర్లించేలా అమర్చుకోవాలి.

Telugu Badam, Beautiful Eyes, Copper Plate, Eye Kajal, Kajal Eyes, Katuka, Lates

ఆ త‌ర్వాత బాదం పప్పు ల‌ను మండిస్తే.పై ప్లేట్‌ అడుగు భాగంలో మందపాటి లేయర్‌లా మసి పేరుకు పోతుంది.ఆ మ‌సిని తీసుకుని కొబ్బ‌రి నూనెను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే కాటుక సిద్ధ‌మైన‌ట్టే.

ఈ న్యాచుర‌ల్ కాటుక‌ను చిన్న డబ్బాల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే రోజూ వాడుకోవ‌చ్చు.

Telugu Badam, Beautiful Eyes, Copper Plate, Eye Kajal, Kajal Eyes, Katuka, Lates

ఇక మ‌రో విధంగా కూడా కాటుక‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.ఒక నాలుగైదు చార్‌ కోల్‌ క్యాప్సూల్స్ తీసుకుని.అందులోని పౌడ‌ర్‌ను ఒక బౌల్‌లో వేసుకోవాలి.

ఇప్పుడు ఈ పౌడ‌ర్‌లో కొద్దిగా ఆముదం వేసి చిక్కటి పేస్ట్‌ అయ్యే వ‌ర‌కు క‌లుపుకుంటే కాటుక రెడీ అయిన‌ట్టే.దీన్ని చిన్న డబ్బాలో వేసుకోని ఎప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు యూజ్ చేయ‌వ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube