మెడ నలుపుNeck darkness తో బాధపడుతున్నారా.? ముఖం తెల్లగా మృదువుగా ఉన్నా మెడ మాత్రం నల్లగా అందవిహీనంగా కనిపిస్తుందా.? మెడ నలుపును వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారా.? అయితే అసలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే ఒక్క దెబ్బకే నల్లగా ఉన్న మెడ తెల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు లేటు మెడ నలుపును ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మెడను వెట్ క్లాత్( Wet cloth ) తో శుభ్రంగా తుడుచుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Suger ,Honey,Turneric,Lemon ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి నిమ్మ చెక్క సహాయంతో కనీసం మూడు నిమిషాలు పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై మెడను వాటర్ తో వాష్ చేయాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు
అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు బంగాళాదుంప రసం
వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.
ఆపై తడి క్లాత్ తో మెడను తుడుచుకోవాలి.
చివరిగా ఒక బౌల్ తీసుకుని అందులో
వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి
వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెడకు ప్యాక్ లా ఏదైనా బ్రష్ సహాయంతో కాస్త మందంగా అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల పాటు మెడను ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే ఒక్క దెబ్బకే మీ మెడ నలుపు చాలా వరకు వదిలిపోతుంది.
వారానికి రెండు సార్లు పైన చెప్పిన విధంగా చేస్తే నల్లగా ఉన్న మెడ తెల్లగా మల్లెపువ్వు మాదిరి మెరుస్తుంది.