ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్న గద్వాల ఎమ్మెల్యే ..రేవంత్ తో భేటీ 

బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి( Bandla Krishna Mohan Reddy ) వ్యవహారం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు అనట్టుగా సాగుతోంది.గత నెలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఆయన చేరారు .

 Meeting Gadwala Mla Revanth Who Is Giving Twists On Twists , Bandla Krishnamoha-TeluguStop.com

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వచ్చిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం పెద్ద సంచలనమే అయింది .ఇంతలోనే కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తో ఆయన సమావేశం అయ్యారు.

Telugu Aicc, Brs Ktr, Pcc, Revanth Reddy, Telangana Cm, Ts-Politics

ఈ సందర్భంగా మళ్లీ తాను బీ ఆర్ ఎస్ లోకి వచ్చేస్తానని కేటీఆర్ తో చెప్పడం మరో సంచలనంగా మారింది.ఈయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన చాలామంది ఎమ్మెల్యేలు తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో ఉండడం ,తదితర పరిస్థితుల నేపథ్యంలో స్వయంగా రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Telugu Aicc, Brs Ktr, Pcc, Revanth Reddy, Telangana Cm, Ts-Politics

 తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupally Krishna Rao ) బండ్ల కృష్ణమోహన్ తో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వద్దకు కృష్ణ మోహన్ ను తీసుకువచ్చారు.  రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కృష్ణమోహన్ రెడ్డి ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ పై రేవంత్ రెడ్డితో చర్చించారు.  బండ్లకు నామినేటెడ్ పదవి లేదంటే,  నియోజకవర్గ అభివృద్ధి కి నిధులు  ఇచ్చేలా ఒప్పించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ సందర్భంగా గద్వాల్ నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.నిన్న బండ్ల ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జూపల్లి గద్వాల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

  ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుతామన బండ్లకు హామీ ఇచ్చి బీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రయత్నం విరమించుకోవాల్సిందిగా సూచించారు.నియోజకవర్గ అభివృద్ధి పై మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని బండ్ల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేటీఆర్ ఇతర నేతలతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మంచి అనుబంధం ఉందని జూపల్లి కృష్ణారావు వివరించారు .అందుకే ఆయన కేటీఆర్ ను కలిశారని,  ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మళ్లీ బీఆర్ఎస్ లో చేరే అవకాశం లేదని జూపల్లి ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube