ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీసులోనే లవర్‌ని వెతుక్కుంటే క్యాష్ రివార్డ్స్.. ఎక్కడంటే..

చైనా దేశంలో( China ) ప్రవేశపెట్టే కొన్ని పథకాలు అనేవి మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి.ఇటీవల షెన్‌జెన్‌లోని ఒక ప్రముఖ టెక్ కంపెనీ ఇన్‌స్టా360( Insta360 ) తన ఉద్యోగులు తమ సహ ఉద్యోగులను ప్రేమించాలని ప్రోత్సాహించే ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 China Firm Offers Cash Incentives To Help Staff Find Love Details, China, Insta3-TeluguStop.com

ఉద్యోగుల మధ్య బంధాన్ని బలపరచడం, వారి సంతోషాన్ని పెంచడం, వారి మధ్య పెళ్లిలో జరిగేలా చూడటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

కంపెనీ ఇంటర్నల్‌గా ఒక డేటింగ్( Dating ) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఒంటరిగా ఉన్న ఇతర ఉద్యోగుల గురించి పోస్ట్‌లు చేయడం ద్వారా ఉద్యోగులు క్యాష్ బెనిఫిట్స్ పొందవచ్చు.ఉద్యోగులు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సింగిల్‌గా ఉన్న ఇతర ఉద్యోగుల గురించి తెలుసుకొని ప్రేమలో పడొచ్చు.

అలా ప్రేమలో పడితే క్యాష్ రివార్డ్స్( Cash Rewards ) కూడా అందుకోవచ్చు.దీని ద్వారా ఔట్ సైడర్స్ అయిన సింగిల్ వ్యక్తిని కూడా పరిచయం చేయవచ్చు.ఒకవేళ ఈ సింగిల్ వ్యక్తిని కంపెనీలో ఉన్న మరో సింగిల్ వ్యక్తితో ప్రేమలో పడేలా చేస్తే 66 యువాన్లు (సుమారు రూ.770) ఇస్తారు.ఒకవేళ ఇలా పరిచయమై ప్రేమలో పడిన వ్యక్తులు మూడు నెలలు హ్యాపీగా కలిసి ఉండగలిగితే ఈ కార్యక్రమం మూడు నెలల కంటే తక్కువ కాలం క్రితం ప్రారంభమైంది.

Telugu Cash, China, China Firm, Insta, Staff Find Love-Telugu NRI

పరిచయం చేసిన ఉద్యోగికి, కొత్తగా పరిచయమైన వ్యక్తికి, కంపెనీ ఉద్యోగికి 1000 యువాన్లు (సుమారు రూ.11,700) బహుమతి లభిస్తుంది.ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి కంపెనీ ఫోరమ్‌లో దాదాపు 500 పోస్ట్‌లు వచ్చాయి.కంపెనీ ఈ పోస్ట్‌లు చేసిన వారికి ఇప్పటికే దాదాపు 10,000 యువాన్లు (సుమారు రూ.1.16 లక్షలు) చెల్లించింది.

Telugu Cash, China, China Firm, Insta, Staff Find Love-Telugu NRI

ఈ కార్యక్రమానికి ఉద్యోగులు( Employees ) సానుకూలంగా స్పందిస్తున్నారు.ఒక ఉద్యోగి వ్యంగ్యంగా, “నా కంపెనీ నేను ప్రేమలో పడాలని నా అమ్మ కంటే ఎక్కువగా కోరుకుంటుంది” అని అన్నారు.అయితే, ఈ ఆలోచన చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ డౌయిన్‌లో మిశ్రమ స్పందనలు పొందింది.

ఒక యూజర్ వ్యంగ్యంగా, “కంపెనీ ఉద్యోగులను నియమించుకుంటోందా?” అని అడిగారు.మరొకరు, “ప్రభుత్వం కూడా ఇలాగే ప్రయత్నించాలి” అని వ్యాఖ్యానించారు.

అయితే, కొంతమంది ప్రజలు ప్రేమను డబ్బుతో కొనలేమని విమర్శించారు.

చైనాలో పెళ్లిళ్లు, జననాల సంఖ్య తగ్గుతున్న సమస్య తీవ్రతరమవుతోంది.2024లో మొదటి మూడు త్రైమాసికాలలో కేవలం 47.4 లక్షల జంటలు మాత్రమే పెళ్లి రిజిస్టర్ చేసుకున్నారు, ఇది 2023తో పోలిస్తే 16.6% తగ్గుదల.2023లో జనన రేటు కూడా 1000 మందికి 6.77 నుండి 6.39కి తగ్గింది.ఈ పరిస్థితిని అదుపు చేయడానికి, చైనా ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది.ఉదాహరణకు, షాన్‌షీ ప్రావిన్స్‌లో 35 ఏళ్లలోపు మహిళలతో పెళ్లి చేసుకునే జంటలకు 1500 యువాన్‌లు (సుమారు రూ.17,500) ఇవ్వాలని నిర్ణయించారు.అయితే, ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో చాలా మంది మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube