2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) గెలవడంతో అమెరికాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.త్వరలోనే ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
తాను బాధ్యతలు చేపట్టే నాటికి బలమైన, సమర్ధవంతమైన టీమ్‌ను కూడా సెట్ చేసే పనిలో ట్రంప్ ఉన్నారు.
ట్రంప్ అధ్యక్షుడు కావడంతో పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు దేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నిజానికి వీరిలో చాలా మంది అధ్యక్ష ఎన్నికలకు ముందే తమ ఉద్దేశాలను స్పష్టం చేశారు.హాలీవుడ్ నటి షారోన్ స్టోన్ ఇటలీలో ఓ ఇంటిని ఇప్పటికే పరిశీలిస్తున్నారట.
రావెన్ సైమోనే, మిరాండా మాడేలు( Raven Simone, Miranda Madeleine ) కూడా ట్రంప్ అధ్యక్షుడిగా గెలిస్తే తాము అమెరికాను వీడతామని ముందే ప్రకటించారు.కెనడాలో స్థిరపడేలా రావెన్ సైమోన్ పావులు కదుపుతున్నారు.
నటి , దర్శకురాలు అమెరికా ఫెర్రెరా ( Ferreira )కూడా అమెరికాకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.యూకేలో కొత్త ఇల్లు ఎంపిక చేసే పనిలో ఆమె బిజీగా ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.దాదాపు మూడు దశాబ్ధాలుగా లాస్ ఏంజెల్స్‌లో నివసించిన అనంతరం తిరిగి యూకేకు వెళ్లాలని మిన్నీ డ్రైవర్ ( Minnie Driver )యోచిస్తున్నారు.హూపీ గోల్డ్ బెర్గ్ కూడా స్వయంగా తన షోలోనే అమెరికా విడిచి వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలిపారు.
ట్రంప్‌కు బిలియనీర్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గట్టి మద్ధతుదారుడిగా ఉన్నప్పటికీ అతని ట్రాన్స్‌జెండర్ కుమార్తె వివియన్ విల్సన్ కూడా అమెరికాను వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అమెరికాను వీడాలని భావిస్తున్న సెలబ్రెటీలు.తక్కువ ఇంటి అద్దె, గృహ సదుపాయం, బలమైన ఆర్ధిక వ్యవస్ధ, పటిష్టమైన శాంతి భద్రతలు వున్న దేశాలను ఎంచుకుంటున్నారు.అయితే అమెరికన్లకు ప్రపంచంలోని పలు దేశాలు సులభంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.
ఈజీగా వీసా పొందడంతో పాటు గోల్డెన్ వీసా వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.