ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు.. తెలుసా?

యువతి యువకులను అత్యధికంగా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి అనడంలో సందేహం లేదు.హార్మోన్ చేంజ్, విటమిన్ డి లోపం, ఆయిలీ స్కిన్, ఆహారపు అలవాట్లు, చర్మంపై డస్ట్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి తదితర అంశాల కారణంగా మొటిమలు వేధిస్తూ ఉంటాయి.

 If You Use This Homemade Cream, You Will Get Rid Of Pimples! Pimples, Pimples Tr-TeluguStop.com

ఈ మొటిమలు తీవ్రమైన నొప్పిని కలగ చేయడమే కాదు చర్మ సౌందర్యాన్ని సైతం దెబ్బతీస్తాయి.దాంతో మొటిమలను నివారించుకోవడం కోసం ముప్ప తిప్ప‌లు పడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను రోజూ కనుక వాడితే మొటిమలు త్వరగా తగ్గడమే కాదు మళ్ళీ మళ్ళీ దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.మరి ఇంతకీ ఆ హోమ్‌ మేడ్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ ను వేసుకోవాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Tips, Face Cream, Homemade Cream, Latest, Pimples, Skin Care, Skin Care T

ఆ తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మ్యాంగో టర్మరిక్ పౌడర్ వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ ను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్‌ వేసుకోవాలి.అలాగే తయారు చేసి పెట్టుకున్న వాటర్ ను మూడు టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా నాలుగు చుక్కలు రోజ్‌ ఎసెన్షియల్ ఆయిల్ ను వేసి మరోసారి మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ సిద్ధమవుతోంది.

Telugu Tips, Face Cream, Homemade Cream, Latest, Pimples, Skin Care, Skin Care T

రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని కనీసం నాలుగు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై నిద్రించాలి.ప్రతిరోజు ఈ విధంగా చేస్తే మొటిమలు చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.

వాటి తాలూకు మచ్చలు ఏమైనా ఉంటే మాయమవుతాయి.అలాగే ఈ క్రీమ్ ను రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల మొటిమలు మళ్ళీ మళ్ళీ వేధించకుండా సైతం ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube