'దసరా' టీజర్ అప్డేట్.. ఒక్కో భాషలో ఒక్కో సెలబ్రిటీ రిలీజ్!

న్యాచురల్ స్టార్ నాని సినిమాలు అంటే ఇష్టపడని వారు ఉండరు.ఎందుకంటే ఈయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ లో అంత పట్టు ఉంది అనే చెప్పాలి.

 Nani's Dasara Teaser Launch By 4 Stars, Dhanush, Shahid Kapoor, Dulquer Salmaan,-TeluguStop.com

కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూర్చుని చూసే విధంగా నాని సినిమాలు ఉంటాయి.నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకుని ఆ వెంటనే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించిన కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం మెప్పించలేక పోయింది అనే చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత ప్రెజెంట్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ”దసరా” సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతుంది.నాని ఎప్పుడు లేని విధంగా పక్కా మాస్ సినిమా చేస్తున్నాడు.

Telugu Dasara, Dhanush, Dulquer Salmaan, Nani, Nanisdasara, Rakshit Shetty, Shah

నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇంత వరకు చేయక పోవడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి మరింత హైప్ పెంచడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Dasara, Dhanush, Dulquer Salmaan, Nani, Nanisdasara, Rakshit Shetty, Shah

ఈ క్రమంలోనే అతి త్వరలోనే దసరా టీజర్ రిలీజ్ చేయనున్నారు.మరి ఈ టీజర్ ను ఒక్కో భాషలో ఒక్కో సెలబ్రిటీ రిలీజ్ చేయబోతున్నారు అని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు.తెలుగులో గ్రాండ్ ఈవెంట్ తో రిలీజ్ చేయనుండగా.హిందీలో ఈ టీజర్ ను షాహిద్ కపూర్, తమిళ్ లో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

దీంతో వీరి కారణంగా అన్ని భాషల్లో ఒకేసారి భారీ హైప్ రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube