కిడ్నీలలోనీ రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి..!

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు కిడ్నీలలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

 Are You Suffering From Kidney Stones But Do This , Kidneys ,overweight, Healt-TeluguStop.com

ముఖంగా అధిక బరువు,( Overweight ) మందులు, సప్లిమెంట్స్ లాంటి ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల కిడ్నీలలో రాళ్లు( Kidney stones ) వస్తుంటాయి.ఈ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రా శయం వరకు మన మూత్ర మార్గంలోని ఎన్నో భాగాలను ప్రభావితం చేస్తాయి.

అయితే మూత్రపిండాలలో రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది.ఈ నొప్పిని భరించడం ఎంతో కష్టమవుతుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం ఏం చేస్తే కిడ్నీలలో రాళ్లు కరిగిపోతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Calcium, Problem, Tips, Kidney, Kidneys, Salt, Spinach-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీ లలో రాళ్ళు ఉన్నవారు నీళ్లను( water ) ఎక్కువగా తీసుకోవాలి.నీళ్లు మన శరీరంలోని వ్యర్ధాలను బయటకి పంపుతాయి.నీళ్ళను ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి.

అందుకే ప్రతి రోజు కనీసం రెండున్నర లీటర్లు నీరు త్రాగాలి.అయితే రోజుకు పది గ్లాసుల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు.

మూత్రపిండాలలోనీ రాళ్లతో ఇబ్బంది పడుతున్నప్పుడు బెర్రీలు, చాక్లెట్, బచ్చలి కూర( Spinach ), గోధుమ రవ్వ, దుంపలు, టీ లాంటి ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.ఎందుకంటే ఇవి మూత్రపిండాలలో రాళ్ళను మరింత పెంచుతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే క్యాల్షియం( Calcium ) ఒక పోషకం.ఇది మన ఎముకలను, దంతాలను, కండరాలను బలపరుస్తుంది.

Telugu Calcium, Problem, Tips, Kidney, Kidneys, Salt, Spinach-Telugu Health Tips

ఇంకా చెప్పాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు క్యాల్షియం( Calcium ) పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు ప్రోటీన్లు మరి ఎక్కువగా తీసుకోకూడదు.ఎందుకంటే దీని వల్ల మూత్రపిండాలు ఎక్కువ క్యాల్షియన్నీ బయటకు విడుదల చేస్తాయి.దీంతో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.మూత్రంలో ఉప్పు స్థాయిలు ఎక్కువగా ఉంటే కూడా కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.అందుకోసం మీరు ఉప్పును( Salt ) వీలైనంత తక్కువగా తీసుకోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube