ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో కాఫీ( Coffee ) ఒకటి.ఆరోగ్య ప్రయోజనాలు గురించి పక్కన పెడితే కురుల సంరక్షణకు( Hair Care ) కాఫీ ఎంతగానో తోడ్పడుతుంది.
అనేక ప్రయోజనాలను అందిస్తుంది.ఈ నేపథ్యంలోనే కాఫీని కురులకు ఎలా ఉపయోగించాలి.? అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత చలికాలంలో చాలా మంది ఫేస్ చేసే సమస్య డ్రై హెయిర్.( Dry Hair ) అయితే ఈ ప్రాబ్లంకు కాఫీతో చెక్ పెట్టవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
అరగంట అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ కాఫీ మాస్క్ జుట్టుకు మంచి కండిషనర్ గా పని చేస్తుంది.
డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తుంది.కురులు మృదువుగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
అలాగే జుట్టు రాలడాన్ని( Hair Fall ) అడ్డుకునేందుకు, జుట్టు ఎదుగుదలకు కూడా కాఫీ తోడ్పడుతుంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల కాఫీలోని కెఫిన్( Caffeine ) హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరుస్తుంది.ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది మరియు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.
చుండ్రు సమస్యకు కూడా కాఫీతో చెక్ పెట్టవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.30 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ తో హెయిర్ వాష్ చేసుకోవాలి.కాఫీ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.మృత చర్మ కణాలను తొలగిస్తుంది.చుండ్రు సమస్యను సంపూర్ణంగా నివారిస్తుంది.