ముఖ చర్మం అందంగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని ఆడవారు అందులోనూ ముఖ్యంగా యువతులు తెగ ఆరాటపడుతూ ఉంటారు.అటువంటి చర్మాన్ని పొందడానికి రకరకాల స్కిన్ కేర్ ఉత్పత్తులను వాడుతుంటారు.
తరచూ బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు.అయితే ఇంట్లోనే పెద్దగా ఖర్చే లేకుండా ఫేషియల్ గ్లో( Facial Glow ) పొందవచ్చని మీకు తెలుసా? అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కా చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.మరి లేటెందుకు ఆ ఇంటి చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పీల్ తొలగించిన రెండు మీడియం సైజ్ బొప్పాయి ముక్కలు,( Papaya ) రెండు టేబుల్ స్పూన్లు చెట్టు నుంచి తీసిన ఫ్రెష్ కలబంద జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, హాఫ్ టీ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ సింపుల్ ఇంటి చిట్కాను కనుక పాటించారంటే ఆశ్చర్యపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ఈ రెమెడీ చర్మాన్ని క్లెన్సింగ్ చేస్తుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.
చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.అలాగే ఈ రెమెడీ చర్మం పై మొండి మచ్చలను మాయం చేస్తుంది.
పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది.ఫేషియల్ గ్లో పొందాలని భావిస్తున్న వారికి ఈ రెమెడీ మంచి ఎంపిక అవుతుంది.
పైగా ఈ రెమెడీతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.