1.కెసిఆర్ పై హరీష్ రావు వ్యాఖ్యలు

దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు కొట్టబోతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
2.బిజెపికి డిపాజిట్లు రావు
తుల ఉమకు అన్యాయం చేసిన బిజెపికి టిక్కెట్లు రావు అని , కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దరిద్రం కొని తెచ్చుకున్నట్లేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
3.కెసిఆర్ కామెంట్స్ పై హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత బలుమూరు వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
4.రేవంత్ రెడ్డి చాలెంజ్
ఆరు నెలలుగా 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు బి.ఆర్.ఎస్ నిరూపిస్తే ఈరోజు మూడు గంటల లోపు నామినేషన్ ఉపసంహరించుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
5.దస్తగిరి పిటిషన్ పై విచారణ వాయిదా

వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ పై నేడు సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్ నవంబర్ 20 వరకు సిబిఐ కోర్టు వాయిదా వేసింది.
6.అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 17న అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా షెడ్యూల్ లో మార్పులు చేశారు .ఈ నెల18 ఉదయం 9 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.
7.గ్రేటర్ లో రేపటి నుంచి కేటీఆర్ రోడ్డు షోలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో రోడ్డు షోలు రేపటి నుంచి నిర్వహించనున్నారు.
8.తుమ్మల కామెంట్స్
అరాచకం అవినీతి పాలన తరిమికొట్టాలని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు పిలుపునిచ్చారు.బెదిరించే వాళ్లకు భయపడకండి .ఎదురు తిరిగి నిలబడాలని పార్టీ నాయకులను ఉద్దేశించి తుమ్మల వ్యాఖ్యానించారు.
9.జిహెచ్ఎంసి కమిషనర్ కు హైకోర్టు హెచ్చరిక

కోర్టు ధిక్కరణ కేసులో ప్రత్యక్షంగా హాజరు కావాలన్న ఆదేశాలు పాటించకపోవడంతో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.
10.దుర్గమును దర్శించుకున్న నటి హన్సిక
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని సినీ నటి హన్సిక దర్శించుకున్నారు.
11.బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనంతో సముద్రంలో ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి.
12.అయ్యప్ప భక్తులకు ప్రత్యేక వందే భారత్ రైళ్లు
శబరిమలై ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చెన్నై తిరునాల్వేలి మధ్య ప్రత్యేక వందే భారత్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
13.జగన్ పై లోకేష్ విమర్శలు

పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గమైన పులివెందుల కు వెళ్లాల్సి వచ్చిన సీఎం జగన్ రెడ్డి గజగజ వణుకుతున్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
14.మధు యాష్కీ నివాసంలో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్ హయత్ నగర్ లో కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ నివాసంపై అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.మధు యాష్కీ నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో పోలీసులు ఈ తనిఖీ చేపట్టినట్లు సమాచారం.
15.తెలంగాణ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి

తెలంగాణ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సవాల్ చేశారు.
16.పురందరేశ్వరి పై విజయసాయిరెడ్డి విమర్శలు
బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
జాతీయ నేతగా ఉండి జాతి నేతగా ఎందుకు మారారు అంటూ పురందరేశ్వరుని ప్రశ్నించారు
17.తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అల్పపీడనం తీవ్ర వాయుగుండం గా మారి తుఫాన్ గా మారనుంది అని వాతావరణ శాఖ తెలిపింది.
18.వైసీపీ బస్సు యాత్ర
ఏపీలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర రెండో దశయాత్రను నేటి నుంచి ప్రారంభించారు.
19.ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

నేడు రాజస్థాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
20.మంత్రి సబిత అనుచరుని ఇంట్లో ముగిసిన సోదాలు
గత మూడు రోజులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ఇంట్లో నిర్వహించిన ఐటీ సోదాలు నేటితో ముగియనున్నాయి.