విక్టరీ వెంకటేష్.టాలీవుడ్ సీనియర్ హీరో.తన పని ఏంటో తాను చేసుకుంటూ ముందుకు వెళ్తాడు.వివాదాల జోలికి అస్సలు పోడు.సినిమాలే తన ప్రపంచంగా కొనసాగుతాడు.ఎప్పుడు అవసరంగా అవతలి వారి గురించి మాట్లాడడు.
అవసరం లేని విషయాల్లో తలదూర్చడు.తన సినిమాలతో పాటు తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తాడు.
ఫ్యామిలీ సినిమాలు తీయడమే కాదు.ఫ్యామిలీ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తాడు.
అంతేకాదు.గొప్పలకు పోకుండా యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడంలోనూ ముందుంటాడు ఈ రామానాయుడు తనయుడు.
ఇప్పటికే పలువురు యువ హీరోలతో కలిసి సినిమాలు చేశాడు కూడా.పవర్ స్టార్ తో గోపాలా గోపాలా.
మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు. రామ్ తో మసాలా.
వరుణ్ తేజ్ తో ఎఫ్-2లో నటించాడు.తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్-3లోనూ నటిస్తున్నాడు.
ఇక సినిమాలే లక్ష్యంగా బతుకుతున్న ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే.వెంకీకి ఓ కొడుకు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.వెంకటేష్ మాజీ భార్య ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావుకు స్వయంగా మేనకోడలు.కామినేని శ్రీనివాసరావు అక్క కూతురునే వెంకటేష్ పెళ్లి చేసుకున్నాడు.
కామినేని 2014లో బీజేపీ నుంచి కైకలూరులో పోటీ చేశాడు.ఆ సమయంలో వెంకటేష్ భార్య ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంది.
ఆమె తన మామను గెలిపించాలని ఓటర్లను కలిసి ప్రచారం చేసింది.
అంటే కాదు.వెంకటేష్. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఆంధ్రా షుగర్స్ డైరెక్టర్ పెండ్యాల అచ్చిబాబుకు స్వయంగా తోడల్లుడు, వెంకటేష్ భార్య, అచ్చిబాబు భార్య.ఇద్దరూ అక్కా చెల్లెల్లు.అచ్చిబాబు సోదరుడు పెండ్యాల క్రిష్ణబాబు టీడీపీ నుంచి 5 సార్లు కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.ప్రస్తుతం అచ్చిబాబు టీడీపీలో చంద్రబాబుకు అత్యంత దగ్గరి మనిషిగా కొనసాగుతున్నాడు.కొవ్వూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మొత్తంగా వెంకటేష్ కుటుంబానికి రాజకీయాలతో దగ్గరి సంబంధం ఉంది.