యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా కొన్ని రోజుల క్రితం విడుదలైన సత్యదేవ్ నటించిన తిమ్మరుసు ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకున్న సంగతి తెలిసిందే.థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత రిలీజైన తిమ్మరుసు సినిమాలో సత్యదేవ్ లాయర్ రామచంద్ర అనే పాత్రలో నటించారు.
అమాయకుడైన వాసు అనే కుర్రాడు తప్పు చేయకపోయినా ఎనిమిది సంవత్సరాలు జైలు పాలవడంతో ఆ కేసును రామచంద్ర రీఓపెన్ చేయిస్తాడు.
కేసు రీఓపెన్ చేసిన తర్వాత వెలుగులోకి వచ్చిన నిజాలేంటి? వాసు నిజంగానే తప్పు చేశాడా? లేదా? ఇతర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తిమ్మరుసు చూడాల్సిందే.తిమ్మరుసు సినిమా కోర్టు రూమ్ డ్రామా అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునే చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవగా ఈ సినిమాతో సత్యదేవ్ ఖాతాలో మరో హిట్ చేరిందనే చెప్పాలి.
![Telugu Satyadev, Ankith, Result, Tak, Timmarusu, Tollywood-Movie Telugu Satyadev, Ankith, Result, Tak, Timmarusu, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/07/ramachandra-role-satya-dev-timmarasu-movie-tollywood-actor-satyadev.jpg )
కథ, కథనం అద్భుతంగా ఉండటంతో పాటు ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ ప్రేక్షకులను ఎక్కువగా అలరించింది.సత్యదేవ్ రామచంద్ర పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు.తన నటనతో ఆ పాత్రకు పూర్తిస్థాయిలో సత్యదేవ్ న్యాయం చేశారు.ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే తిమ్మరుసు మరింత ఎక్కువమంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.
![Telugu Satyadev, Ankith, Result, Tak, Timmarusu, Tollywood-Movie Telugu Satyadev, Ankith, Result, Tak, Timmarusu, Tollywood-Movie]( https://telugustop.com/wp-content/uploads/2021/07/result-details-here-hit-result-ramachandra-role-satya-dev-timmarasu-movie.jpg)
ప్రియాంక జవాల్కర్ అను అనే పాత్రలో పాత్ర పరిధి మేరకు నటించారు.అంకిత్ కు అమాయక కుర్రాడి పాత్ర సూట్ అయింది.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి కథనం ప్లస్ అయింది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ తిమ్మరుసు మూవీకి చక్కగా కుదిరాయి.కేసును రామచంద్ర పాత్ర పర్సనల్ లైఫ్ కు లింక్ పెట్టిన సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.