గుర‌క మిమ్మ‌ల్ని బాధిస్తుందా? అయితే ఆవు నెయ్యితో చెక్ పెట్టండిలా!

గుర‌క‌.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని బాధించే స‌మ‌స్య ఇది.పురుషుల్లోనే కాదు స్త్రీల‌లోనూ గుర‌క స‌మ‌స్య ఉంటుంది.నిద్రించే స‌మ‌యంలో గుర‌క పెట్ట‌డం వ‌ల్ల త‌మ కంటే చుట్టుపక్కల ఉన్న వారేఎక్కువ‌గా ఇబ్బంది ప‌డుతుంటారు.

 Cow Ghee Helps To Get Rid Of Snoring Problem! Cow Ghee, Snoring Problem, Snoring-TeluguStop.com

శ్వాస మార్గంలో అడ్డంకులు, అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కు లోపలి భాగం వాచి పోవడం, మ‌ద్యపానం, ధూమ‌పానం, ఊబ‌కాయం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోవ‌డం.ఇలా వివిధ కార‌ణాల వ‌ల్ల గుర‌క స‌మ‌స్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను ఎలా వ‌దిలించుకోవాలో అర్థంగాక ఎంత‌గానో బాధ ప‌డుతున్నారు.ఈ క్ర‌మంలోనే కొంద‌రు గురక పెట్టకుండా అడ్డుకోడానికి మార్గెట్లో ల‌భ్య‌మ‌య్యే ఉత్పత్తుల‌పై ఆధార‌ప‌డుతుంటారు.

కానీ, న్యాచుర‌ల్‌ గానే గుర‌క స‌మ‌స్య‌కు స్వ‌స్తి ప‌ల‌కొచ్చు.అందుకు ఆవు నెయ్యి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Telugu Cow Ghee, Tips, Latest, Problem-Telugu Health - తెలుగు హె

ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.ముఖ్యంగా రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల ఆవు నెయ్యిని తీసుకుంటే క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి ఇంప్రూవ్ అవుతుంది.గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.లైంగిక స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.థైరాయిడ్ స‌మ‌స్య అదుపులో ఉంటుంది.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు పెరుగుతుంది.

అలాగే గుర‌క స‌మ‌స్య‌నూ ఆవు నెయ్యి నివారిస్తుంది.

అదెలాగంటే.నిద్రించే ముందు రెండంటే రెండు చ‌క్క‌ల‌ ఆవు నెయ్యిని ముక్కులో వేసుకుని త‌ల కింద దిండు  లేకుండా అర గంట పాటు ఉండాలి.

ఆపై ప‌డుకుంటే గుర‌క స‌మ‌స్యే ఉండ‌దు.పైగా ఆవు నెయ్యిని ముక్కులో వేసుకుంటే మైగ్రేన్ త‌ల నొప్పి నుంచి విముక్తి ల‌భిస్తుంది.

సైనస్ స‌మ‌స్య త‌గ్గుతుంది.మ‌రియు మెద‌డు చురుకుద‌నం సైతం పెరుగుతుంది.

అయితే గుర్తించుకోవాల్సిన విష‌యం ఏంటంటే.స్వ‌చ్ఛ‌మైన ఆవు నెయ్యినే వాడాలి.

అదే ఆరోగ్యానికి మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube