న్యాచురల్ గా ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

సాధారణంగా కొందరికి ముఖ చర్మంపై అవాంఛిత రోమాలు చాలా అధికంగా ఉంటాయి.ఇవి అసహ్యంగా కనిపిస్తాయి.

 Try This Home Remedy For Removing Facial Hair Naturally! Facial Hair, Facial Hai-TeluguStop.com

ముఖంలో మెరుపును మాయం చేస్తాయి.పైగా అన్ వాంటెడ్ హెయిర్ కారణంగా ముఖం రంగు కూడా తక్కువగా కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే ఫేషియల్ హెయిర్ ను తొలగించుకోవడం కోసం షేవింగ్, వ్యాక్సింగ్ ఇలా రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు.ఇంకొందరు న్యాచురల్ గా ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసుకోవాలని భావిస్తుంటారు.

అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

Telugu Tips, Facial, Facial Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Hea

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్( Corn flour ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ మరియు పావు కప్పు వేడి వేడి పాలు పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.మూడు నాలుగు నిమిషాలు కలిపిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ ( Almond oil )వేసుకొని మరోసారి మిక్స్ చేయాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్ సహాయంతో అప్లై చేసుకుని పది నిమిషాలు పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Facial, Facial Remedy, Latest, Skin Care, Skin Care Tips-Telugu Hea

ఆపై హెయిర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో చర్మాన్ని వేళ్ళతో రుద్దుతూ వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.ఫైనల్ గా వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే ఫేషియల్ హెయిర్ సహజంగానే రిమూవ్ అవుతుంది.

చర్మం క్లీన్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.చర్మం పై పేరుకుపోయిన మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ కలర్ సైతం ఇంప్రూవ్‌ అవుతుంది.కాబట్టి అవాంఛిత రోమాలను తొలగించుకుని ముఖాన్ని అందంగా మెరిపించుకోవాల‌ని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube