సినీనటుడు అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) శోభిత( Sobhita ) వివాహం డిసెంబర్ 4వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సంగతి తెలిసిందే నాగచైతన్యకు ఇది రెండో వివాహం అయినప్పటికీ శోభిత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య అనంతరం శోభిత ప్రేమలో పడి ఈమెను కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఈ విధంగా నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా పెళ్లి తర్వాత ఈ జంట ది న్యూయార్క్ టైమ్స్ కు( The New York Times ) ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిద్దరూ వారి ప్రేమ పెళ్లి గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు.అదేవిధంగా నాగచైతన్య కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లికి ముందు నుంచి శోభితకు తాను ఒక కండిషన్ పెట్టానని తెలియజేశారు.మరి శోభితకు నాగచైతన్య ఎలాంటి కండిషన్ పెట్టారనే విషయానికి వస్తే.శోభిత తనతో మాట్లాడితే ఇంగ్లీషులో మాట్లాడకూడదని తెలుగులోనే( Telugu ) మాట్లాడాలి అనే కండిషన్ పెట్టారట.
శోభిత పక్క తెలుగమ్మాయి అనే విషయం మనకు తెలిసిందే.
ఇక నాగచైతన్య కూడా తెలుగు హీరో అయినప్పటికీ ఈయన చిన్నప్పటినుంచి తన తల్లి వద్ద చెన్నైలో పెరగటం వల్లే ఆయన ఎక్కువగా తమిళం మాట్లాడుతారు తప్ప తెలుగు తనకు సరిగా రాదని తెలిపారు.అందుకే తాను తెలుగులో స్పష్టంగా మాట్లాడాలి అంటే తనతో తెలుగులోనే మాట్లాడమని శోభితకు చెప్పానని అలా ఆమె తెలుగులో మాట్లాడటం వల్ల నేను కూడా తెలుగు మరింత మెరుగు పరుచుకునే అవకాశం ఉంటుందని నాగ చైతన్య తెలిపారు.ఇక ఎవరైనా తెలుగు మాట్లాడేవారు నాకు పరిచయం అయితే గనుక నేను వారికి తొందరగా కనెక్ట్ అవుతానని నాగచైతన్య వెల్లడించారు.
ఇక సినిమా ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వారందరూ భాగవుతూ ఉంటారు కాబట్టి తెలుగు మాట్లాడటానికి వీలు ఉండదని అందుకే శోభిత నాతో మాట్లాడిన ప్రతిసారి తెలుగులోనే మాట్లాడమని తనకు చెప్పాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.