సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కానీ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.
ఇక వాళ్ళను ఎవరు పట్టించుకోరు.స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేది హీరోలు మాత్రమే కాబట్టి వాళ్ల పేర్లు మాత్రమే సగటు ప్రేక్షకులకు గుర్తుంటాయి.
వాళ్ళను చూసే సినిమా థియేటర్ కు వస్తుంటారు…ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్( Jr NTR ) సైతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుకునే విధంగా ముందుకు సాగుతున్నారు.

ఇక ప్రస్తుతం వార్ 2( War 2 ) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈయన ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమా( Dragon Movie ) మీద పూర్తి ఫోకస్ ను పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా పుష్ప 2( Pushpa 2 ) సినిమా రికార్డును బ్రేక్ చేస్తుంది అంటూ ఇప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలైతే పెట్టుకుంటున్నారు.మరి పుష్ప సినిమా రికార్డును బ్రేక్ చేసే రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందా అనే వార్తలు కూడా వినబడుతున్నాయి.
ప్రస్తుతానికైతే పుష్ప 2 1500 కోట్లు మార్కు ను దాటుకొని 2000 కోట్ల టార్గెట్ ను రీచ్ అయ్యే విధంగా ముందుకు సాగుతుంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నప్పటికి ఆ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందనే ఒక దృఢ సంకల్పంతో ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
.