జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఆ సలహా వల్లే బింబిసార హిట్టైందా.. అసలేం జరిగిందంటే?

డైరెక్టర్ వశిష్ట,( Director Vassishta ) నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కాంబినేషన్లో వచ్చిన బింబిసార సినిమా( Bimbisara ) ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

 Do You Know Vishwambhara Movie Director Vassishta Mallidi Struggles Before Bimbi-TeluguStop.com

అయితే వశిష్ట దర్శకుడు అయ్యేముందు చాలా మంది దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయడమే కాక డైరెక్టర్ గా పలువురు హీరోలతో సినిమాలు మొదలయి ఆగిపోయాయట.వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ( Mallidi Sathyanarayana ) నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈయన చాలా సినిమాలకు పని చేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లిడి సత్యనారాయణ తన కొడుకు కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

కాగా ఈ సందర్బంగా మల్లిడి సత్యనారాయణ మాట్లాడుతూ.డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొన్నాళ్ళు పని చేశాక వినాయక్ ద్వారా రవితేజకు కథ చెప్పాడు.

Telugu Bimbisara, Vassishta, Jr Ntr, Nandamurikalyan, Nithin, Vishwambhara-Movie

ఆయన ఓకే అన్నాడు.నిర్మాత కూడా ఆయనే చూస్తా అన్నాడు.కానీ అది వర్కౌట్ అవ్వలేదు.ఆ తర్వాత నితిన్ తో( Nithin ) సినిమా అనుకున్నాడు.డబ్బులు కూడా ఖర్చుపెట్టాము.కానీ అఆ సినిమా హిట్ అవ్వడంతో కొత్త డైరెక్టర్ తో వద్దు అన్నాడు నితిన్ వాళ్ళ నాన్న.

అల్లు శిరీష్, మా వాడు ఫ్రెండ్స్.శిరీష్ కి కథ చెప్పి నిర్మాత కూడా ఓకే అయి అడ్వాన్స్ లు కూడా తీసుకున్నారు.

సినిమా ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా చేసారు.కానీ శ్రీరస్తు శుభమస్తు హిట్ అవ్వడంతో ఫ్రెండ్ అయినా కొత్త డైరెక్టర్ తో చేయను అన్నాడు శిరీష్.

అరవింద్ గారు తిట్టినా వినలేదు.అరవింద్ గారు కావాలంటే వేరే హీరో డేట్స్ ఇప్పిస్తాను అన్నారు.

అది కూడా అవ్వలేదు.అలా సినిమాలు మొదలయి ఆగిపోతుండటంతో మా వాడు బాధపడటం చూడలేక నేనే మళ్ళీ హీరోగా చేయమని చెప్పాను.

అలా మా వాడు హీరోగా సినిమా కూడా ఓపెనింగ్ చేసాము.మళ్ళీ ఏమైందో హీరోగా చేయను, రాజ్ తరుణ్ కి కథ చెప్పాను ఓకే చెప్పాడు అని చెప్పడంతో నాకు తెలిసిన నిర్మాత చేస్తా అనడంతో రాజ్ తరుణ్ తో తుగ్లక్ సినిమా మొదలైంది.

Telugu Bimbisara, Vassishta, Jr Ntr, Nandamurikalyan, Nithin, Vishwambhara-Movie

ఆ నిర్మాత అడ్వాన్స్ లు ఇచ్చాడు.తర్వాత కథ నచ్చలేదు అని వేరే కథల కోసం వెతికాడు నిర్మాత.అప్పుడు రాజ్ తరుణ్ కి వరుస ఫ్లాప్స్ పడటంతో మార్కెట్ లేదు అని సినిమా ఆపేసాడు.ఆ తర్వాత నిర్మాత చిగురుపాటి చక్రి రాజ్ తరుణ్ కి చెప్పిన కథ ఏదో బాగుంది అంట కళ్యాణ్ రామ్ కి చెప్పు అని వశిష్టకు చెప్పాడు.

అప్పటికే వశిష్ట కళ్యాణ్ రామ్ కి ఒక కథ చెప్పి వచ్చాడు.అది నచ్చినా నిర్మాతలు రాలేదు.మళ్ళీ ఛాన్స్ రావడంతో వెళ్లి రాజ్ తరుణ్ కి చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి చెప్పాడు.కళ్యాణ్ రామ్ కి కథ చెప్తే ఓకే చెప్పాడు.

కానీ 25 కోట్లు బడ్జెట్ అవుద్ది, నాకు ఇప్పుడు మార్కెట్ లేదు.అందుకే నేనే నిర్మాతగా చేసుకుంటా.

నాకు ఈ సినిమాలో నటనకు స్కోప్ ఉంది అని చెప్పి తీసుకున్నాడు కళ్యాణ్ రామ్.ఆ కథని ఎన్టీఆర్( NTR ) కి చెప్పిస్తే టైటిల్ మార్చమన్నారు.

అలాగే ముస్లిం రాజు వద్దు, హిందూ రాజు బేస్డ్ కథ మార్చుకోండి అన్నారు.

రెండు రోజుల్లో చరిత్ర అంతా వెతికి బింబిసార అనే రాజుని రిఫరెన్స్ తీసుకొని అదే టైటిల్ పెట్టుకున్నారు.కానీ అప్పుడు కూడా మళ్ళీ కష్టాలే.2018 లో సినిమా మొదలు పెట్టారు.గెస్ట్ లు ఎవరు లేరు, నన్ను పిలిచి క్లాప్ కొట్టమన్నారు.షూట్ మొదలయ్యాక కరోనా వల్ల మొదలయిన నాలుగు రోజులకే సినిమా ఆగింది.కరోనా వల్ల చాలా లేట్ అయింది షూట్.నాలుగేళ్లు చేసి 2022 లో రిలీజ్ చేసారు.

అప్పుడు కూడా పోటీకి సినిమాలు ఉన్నాయి అయినా హిట్ కొట్టింది.సినిమా రిలీజ్ ముందు వశిష్ట అని పేరు మార్చుకున్నాడు మా అబ్బాయి.

అన్ని సిన్మాలు మొదలయి ఆగిపోయాయి అని పేరు మార్చుకుంటే కలిసొస్తుందని ఎవరో చెప్పడంతో మార్చుకున్నాను అని చెప్పినట్టు తెలిపారు.అలా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఒక హింట్ వల్ల సినిమా హిట్ అయింది అని చెప్పుకొచ్చారు మల్లిడి సత్యనారాయణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube