జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయాల్లో సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు.పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ప్రజలకు మంచి చేసే ఎన్నో నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.
అయితే గత కొంతకాలంగా పవన్, బన్నీ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ రెండు కుటుంబాల మధ్య సైతం గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది.
అయితే ఆ గ్యాప్ ను తగ్గించే దిశగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతోంది.పవన్ కొడుకు మార్క్ శంకర్( Mark Shankar ) కు కొన్ని రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో పవన్ ఇంటికి బన్నీ వెళ్లి గంట సమయం పాటు పవన్ తో మాట్లాడి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

పవన్ కొడుకుకు ప్రమాదం జరిగిన రోజే బన్నీ పవన్ కు కాల్ చేసి మాట్లాడారట.పవన్ ను బన్నీని కలిసిన ఫోటోలు సైతం త్వరలో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.బన్నీ ప్రస్తుతం అట్లీ( Atlee ) ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.పుష్ప2 ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన నేపథ్యంలో బన్నీ తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు సంబంధించి కూడా త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానున్నాయి.పవన్ సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.