భారతదేశంలో రైలు ప్రయాణం( Train Journey ) అనేది చాలా మంది ప్రజలకు ముఖ్యమైన రవాణా మార్గం.ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోని పరిస్థితుల్లోనూ, అత్యవసరంగా రైలు టిక్కెట్లను( Train Tickets ) బుక్ చేసుకోవడానికి తత్కాల్ టికెట్( Tatkal Ticket ) పథకం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఇండియన్ రైల్వేలు( Indian Railways ) అందిస్తున్న ఈ సేవ ద్వారా, ప్రయాణానికి ఒక్క రోజు ముందు కూడా టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.అయితే తత్కాల్ టికెట్ల రద్దు, రీఫండ్ విధానం గురించి చాలా మందికి స్పష్టత ఉండదు.
ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం.
భారతీయ రైల్వే ప్రకారం నేటి నుండి ఏసీ కోచ్‌లకు బుకింగ్: ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.అలాగే నాన్-ఏసీ కోచ్‌లకు బుకింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ బుకింగ్‌లు, రైలు బయలుదేరే స్థానం నుండి ప్రయాణ తేదీని మినహాయించి, ఒక్క రోజు ముందు ప్రారంభమవుతాయి.
ఈ తత్కాల్ టికెట్లపై ఎలాంటి రాయితీలు ఉండవు.టికెట్ ధరలో తత్కాల్ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తారు.
ట్రావెల్ డిస్టెన్స్ ఆధారంగా టికెట్ ధర మారుతుంది.చార్ట్ తయారయ్యే వరకు మాత్రమే తత్కాల్ బెర్త్‌లను బుక్ చేయవచ్చు.తత్కాల్ టికెట్ బుక్ చేసిన తర్వాత పేరు మార్పు చేయడం సాధ్యం కాదు

అయితే తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసు వస్తుందా? ఈ ప్రశ్న చాలామంది ప్రయాణికుల మదిలో ఉంటుంది.అందుకు భారతీయ రైల్వే నిబంధన ప్రకారం కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్లకు రీఫండ్ ఉండదు.అయితే, రైలు రద్దు అవడం లేదా కోచ్ జతకాకపోవడం లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి డబ్బు వాపసు లభిస్తుంది.ఇలా అనివార్యమైన పరిస్థితులలో రైల్వే తత్కాల్ ఛార్జీలతో సహా మొత్తం టికెట్ ధరను తిరిగి చెల్లిస్తుంది

తత్కాల్ టిక్కెట్లు అత్యవసర ప్రయాణాల కోసం ఉపయోగపడే ముఖ్యమైన సౌకర్యం.అయితే రద్దు, రీఫండ్ విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.టికెట్ బుకింగ్ చేసే ముందు సంబంధిత నిబంధనలు, షరతులను ఒకసారి పరిశీలించడం మంచిది.