కళ్ల కింద నల్లటి వలయాలు(డార్క్ సర్కిల్స్).స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామన్‌గా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.
ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, నిద్రలేమి, హర్మోన్లలో మార్పులు, అధికంగా స్మార్ట్ఫోన్లు యూజ్ చేయడం, గంటలు తరబడి కంప్యూటర్ల ముందు పని చేయడం ఇలా అనేక కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.దాంతో ఆ వలయాలను నివారించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.
అయితే అత్తిపండ్లు డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా ఉపయోగపడతాయి.మరి అత్తిపండ్లను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
![Telugu Tips, Benefits Figs, Dark Circles, Figs, Figs Skin, Latest, Skin Care, Sk Telugu Tips, Benefits Figs, Dark Circles, Figs, Figs Skin, Latest, Skin Care, Sk](https://telugustop.com/wp-content/uploads/2021/08/figs-dark-circles-benefits-of-figs-figs-for-skin-skin-care-skin-care-tips-b.jpg )
అత్తి పండ్లను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్పూన్ అత్తి పండ్ల పేస్ట్, అర స్పూన్ తేనె, అర స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేసుకుని పావు గంట పాటు వదిలేయాలి.అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా నల్లటి వలయాలు దూరం అవుతాయి.
అలాగే అత్తిపండులో సగం ముక్క తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
అందులో ఒక స్పూన్ ఓట్స్ పౌడర్, ఒక స్పూన్ పచ్చి పాటు వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ల కిందే కాకుండా ముఖం మొత్తానికి పట్టించాలి.
ఇరవై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ పోవడమే కాకుండా ముఖ చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
![Telugu Tips, Benefits Figs, Dark Circles, Figs, Figs Skin, Latest, Skin Care, Sk Telugu Tips, Benefits Figs, Dark Circles, Figs, Figs Skin, Latest, Skin Care, Sk](https://telugustop.com/wp-content/uploads/2021/08/figs-dark-circles-benefits-of-figs-figs-for-skin-skin-care-skin-care-ti.jpg )
ఇక ఒక బౌల్‌తో ఒక స్పూన్ అత్తిపండ్లు పేస్ట్, అర స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కళ్ల కింద పూసి పది లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనవ్వాలి.అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.